Brahmi Muhurtam

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

       బ్రాహ్మీముహూర్తంలో లేస్తే..,!

                   ➖➖➖✍️

ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు తెగ పోరేవారు. అలా చెప్పీ చెప్పీ చాలా తరాలు వెళ్లిపోయాయి. 

తరం మారుతున్న కొద్దీ జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. 

కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు. 

కానీ ఇప్పటికీ ‘బ్రాహ్మీముహూర్తం’అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది.

ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది.       ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనం ఏంటి?

సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. 

అయితే ఋతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, 4:00 -4:30 a.mని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. 

బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. 

’ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి?’ అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి.

ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి ఝామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది.

మనలో ‘జీవగడియారం’ అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. 

నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం… ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం.

సాక్షాత్తూ ఆయుర్వేదమే తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి అని చెబుతోంది. 

పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం వాత ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ వాత లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం; ప్రశాంతంగా ఉండగలం; మంచి ఆలోచనలు చేయగలం; చదివినదానిని ఆకళింపు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం.

ధ్యానం చేయాలనుకునేవారికి కూడా               ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి… ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట.

ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు… చాలా తేలికగా ప్రభావవంతంగా సాగుతాయి.

రోజువారీ చేయాల్సిన విధులకు (ఉద్యోగం, కాలేజ్‌, వంటావార్పూ…) ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల… మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.

గుండెజబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే థ్రోంబస్‌ అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి వీధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అయితే బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని… స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. 

ఇన్ని చదివిని తరువాత బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తం అని ఎలా అనుకోగలం చెప్పండి!

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!

                                                                    Courtesy : Chiluveru Madhusudan

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

       Health Benefits of 

Wheat Grass in a nutshell

It protects blood cells. High chlorophyl content. Boosts immunity

Prevents oxidative damage to organs.  Reduces inflammation. Aids digestion.

Prevents bacterial infection. Improves skin tone & color. Detoxifies your liver


 

                                                                          Courtesy : Nanduri Sri Sairam 


##########################################################################

మోక్షదాయక నగరాలు

         గరుడ పురాణ కథనం ప్రకారం మోక్షాన్నిచ్చే నగరాలు ఏడు. అవి- అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతికా, ద్వారక. ఇవి మోక్షదాయకాలని పురాణాలు చెబుతున్నాయి.

అయోధ్య కోసలరాజ్యానికి రాజధాని. సాకేతపురమనీ పిలుస్తారు. భారతదేశంలోని అతిపురాతన నగరాల్లో ఒకటి. దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం. అధర్వణ వేదం దీన్ని విష్ణువు నిర్మించిన నగరంగా చెబుతోంది.

 మధుర   ద్వాపరయుగం నుంచి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది . ఇది శ్రీకృష్ణుడి జన్మస్థానం. బాల్యంలో కృష్ణుడు గోపికలతో గడిపిన స్థలం. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుపుతారు.

హరిద్వార్‌ ఉత్తరాఖండ్‌లో ఉన్న హరిద్వార్‌కు పురాణాల్లో మాయా నగరమని పేరు. గరుడుడు అమృతం తీసుకెళుతున్నపుడు ఇక్కడ ఒక చుక్క పడిందని, అందుకే ఈ క్షేత్రం పవిత్రతను సంతరించుకుందని అంటారు. ఇక్కడ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా జరుగుతుంది.

వారణాసి వరుణ, అసి అనే రెండు ఘాట్ల మధ్య ఉన్నందువల్ల ‘వారణాసి’ అనే పేరు వచ్చింది. పాళీభాషలో దీన్ని భారణాసిగా రాసేవారు. అందువల్ల బనారస్‌ గా మారింది. 
           విశ్వేశ్వరుడు కొలువైన, పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన వారణాసిలో చనిపోయినా, అంత్యక్రియలు జరిగినా నేరుగా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల నమ్మకం.

కంచి  కాంచీపురం, కాంచి సమానార్థక నామాలు. పూర్వం కాంజీవరం, కాంచీపట్టణం అనీ పిలిచేవారు. 
        తమిళనాడులోని ఈ పట్టణం దేవాలయాలకు ప్రసిద్ధి. వైష్ణవ, శైవాలయాలతో పాటు అష్టాదశ పీఠాల్లో ఒకటైన కామాక్షీ ఆలయం ఇక్కడ ఎంతో ప్రాశస్త్యం పొందింది. ప్రముఖ వైష్ణవ ధామం వరదరాజస్వామి ఆలయం, శివుని ఆలయమైన ఏకాంబరేశ్వరస్వామి గుడి, శక్తి క్షేత్రం కామాక్షిదేవి ఆలయం, కుమారకొట్టం, కచ్ఛపేశ్వర దేవాలయం, కైలాసనాథ ఆలయం వంటి దివ్య క్షేత్రాలు కంచిలో ఉన్నాయి.

ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో క్షిప్రా నదీతీరంలో వెలసిన పుణ్యక్షేత్రం ఉజ్జయిని. శైవ, వైష్ణవులకు సైతం అత్యంత పవిత్రమైన నగరం. దీనికే అవంతీనగరమనీ పేరు.         మహాకాళేశ్వర, కాలభైరవ, చింతామణిగణేశ్, గోషా మందిరంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది. ఇక్కడి మహాకాళేశ్వర దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి.
          ఉజ్జయిని  శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు సాందీప ముని చదువుకున్న నగరం ఉజ్జయిని అని భాగవతం వల్ల తెలుస్తోంది. సాందీపని ఆశ్రమం ఈ నగరంలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. చరిత్ర ప్రసిద్ధి పొందిన విక్రమాదిత్య మహారాజు ఉజ్జయినీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతని సోదరుడు ‘భట్టి’ మంత్రిగా, మరొక సోదరుడు భర్తృహరి మహా పండితుడిగా, కాళిదాసాది మహాకవులు అతడి ఆస్థాన నవరత్నాలుగా చరిత్ర ప్రసిద్ధులు.

ద్వారక  సంస్కృతంలో 'ద్వార' అంటే ప్రవేశం అని, 'కా' అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. ద్వారక అంటే మోక్షానికి ప్రవేశ ద్వారమని భావం. పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన నగరమిది. శ్రీకృష్ణుడు మధురను విడిచి దాదాపు వందేళ్లు నివశించిన ప్రాంతం. 
         ఈ క్షేత్రంలో ద్వారకా(ధీష్‌)దీ దేవాలయం, రుక్మిణి దేవాలయం, ఎన్నో ధార్మిక క్షేత్రాలున్నాయి. ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల్లో ఒకటైన శారదా పీఠం ఇక్కడే ఉంది.

         భారతదేశంలో పుట్టినవారు కన్నుమూసేలోగా తప్పనిసరిగా ఈ ఏడు కేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని పెద్దలు చెబుతారు.--(అయ్యగారి శ్రీనివాసరావు)
                                                                                Courtesy Sri M. Mallaiah

######################################################################

లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం... తొమ్మిది వాక్యాలలో..
   మీరు ఏ మతస్తులు అయినా, స్త్రీ లేక పురుషుడు అయినా, బీదా ధనిక అయినా ఏ ప్రాంతం వారైనా సరే.. ఆణిముత్యాలు వంటి ఈ తొమ్మిది వాక్యాలలో మహాభారత సారాంశం తెలుసుకోండి.
  1 మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి,మీ ఆధీనంలోంచి దూరం అవుతారు..వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు 
   ఉదా "కౌరవులు."
 2. . నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. వాటిని అధర్మం కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.
  ఉదా: కర్ణుడు 
3 యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.
 ఉదా.. అశ్వత్థామ.
 4. పాత్రత తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది.
  " భీష్ముడు."
5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  దురహంకారం తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.
 "దుర్యోధనుడు "
6. స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది.
  ఉదా: ధృతరాష్ట్రుడు 
 7. తెలివితేటలకి ధర్మం, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది.
 ఉదా: అర్జునుడు.
8. మోసం,కపటం, జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. 
  ఉదా: శకుని
9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.
       ఉదా : యుధిష్ఠిరుడు.
     " సర్వే జనాః సుఖినోభవంతు."🙏🙏🙏🙏🙏

                                                                       Courtesy: Chiluveru Madhusudan

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

దీపావళి ప్రాముఖ్యత 💞

దసర పోయి, దీపావళి సమీపిస్తున్నప్పుడు, ఒక కాలేజీలోకి యువకులు, యువతులు ఉన్న ఒక సమూహం వచ్చింది. వాళ్ళు విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగారు. కానీ ఒక ప్రశ్న కాలేజీలో నిశ్శబ్దతను తెచ్చిపెట్టింది.

వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, "దీపావళిని 14 ఏళ్ల వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. అప్పుడు దీపావళిని శ్రీరాముడికి బదులు లక్ష్మిదేవిని ఎందుకు పూజిస్తారు?"

అప్పట్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు లేవు. ఎవరికీ సమాధానం తెలియదు. ఆ నిశ్శబ్దతను భంగం చేస్తూ ఒక చేతు పైకెత్తింది.

సమాధానం ఏంటంటే, దీపావళి పండుగకు సత్య యుగం, త్రేతా యుగం అనే రెండు యుగాల ప్రాముఖ్యత ఉంది.

సత్య యుగంలో ఆ రోజున సముద్ర మథనంలో లక్ష్మిదేవి ఆవిర్భవించింది. అందుకే లక్ష్మి పూజ చేస్తారు.

త్రేతా యుగంలో శ్రీరాముడు అయోధ్యకు అదే రోజున తిరిగి వచ్చాడు. అయోధ్య ప్రజలు దీపాలు వెలిగించి ఆయనను స్వాగతం పలికారు. అందుకే దీపావళి.

ఈ పండుగకు రెండు పేర్లు ఉన్నాయి. సత్య యుగానికి చెందిన లక్ష్మి పూజ, త్రేతా యుగానికి చెందిన దీపావళి.

మా సమాధానం విన్న తర్వాత కొంత సేపు మరో నిశ్శబ్దత నెలకొంది. ప్రశ్న అడిగిన సమూహానికి కూడా సమాధానం తెలియదు.

తర్వాత తెలిసింది, ఆ సమూహం కాలేజీల్లోకి వెళ్లి విద్యార్థులలో శ్రీరాముడితో పోల్చితే లక్ష్మి పూజకు ప్రాముఖ్యత లేదనే ఆలోచనను నాటడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు.

కానీ మా సమాధా
Here's the rest of the translation:

మా సమాధానం విన్న తర్వాత ఆ సమూహం అదృశ్యమైపోయింది.

లక్ష్మిదేవి, శ్రీ గణేశ్‌లను దీపావళికి ఎందుకు పూజిస్తారనే ప్రశ్నకు సరైన సమాధానం:

సముద్ర మథనంలో లక్ష్మిదేవి ఆవిర్భవించినప్పుడు ఆమె శ్రీవిష్ణువును వివాహం చేసుకుంది. ఆమె సంపద, సమృద్ధి దేవతగా మారింది. కుబేరుడిని సంపద పంపిణీ బాధ్యుడిగా నియమించింది.

కుబేరుడు మాత్రం కార్పణ్యంతో సంపదను పంపిణీ చేయడం కాకుండా దానిని ఆర్జించేవాడు.

దీంతో లక్ష్మిదేవి శ్రీవిష్ణువును దృష్టి పెట్టింది. శ్రీవిష్ణువు ఆమెకు బాధ్యుడిని మార్చుకోమని సలహా ఇచ్చాడు.

లక్ష్మిదేవి కుబేరుడిని మార్చడానికి అభ్యంతరం పెట్టింది. కుబేరుడు ఆమె భక్తుడని, అతడిని మార్చడం ఆమెకు బాధ కలిగిస్తుందని చెప్పింది.

శ్రీవిష్ణువు లక్ష్మిదేవిని శ్రీ గణేశ్ ద్వారా సంపద పంపిణీ చేయమని సలహా ఇచ్చాడు.

లక్ష్మిదేవి శ్రీ గణేశ్‌ను సంపద పంపిణీ బాధ్యుడిగా నియమించింది.

శ్రీ గణేశ్ తల్లి ఆజ్ఞను తలకు ఎక్కించుకున్నాడు. సంపద పంపిణీలో అడ్డంకులు తొలగించి, సమృద్ధిని ప్రజలకు పంపిణీ చేశాడు.

కుబేరుడు కేవలం ఖజానా దారగా మిగిలిపోయాడు. శ్రీ గణేశ్ సంపద ప్రదాతగా మారాడు.

శ్రీ గణేశ్ సంపద పంపిణీలో నిజాయితీని చూసి, లక్ష్మిదేవి ఆనందించింది. శ్రీ గణేశ్‌ను తన పుత్రుడిగా ఆశీర్వదించింది.

శ్రీవిష్ణువు లేని చోట తనతో శ్రీ గణేశ్ ఉండాలని లక్ష్మిదేవి మనస్సులో నిశ్చయించుకుంది.

కార్తీక మాసంలో అమావాస్య రోజున దీపావళి వస్తుంది. ఆ సమయంలో శ్రీవిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. పదకొండు రోజుల తర్వాత దేవుత్థాన ఏకాదశిని పొందుతాడు.

శరద్ పూర్ణిమ నుంచి దీపావళి వరకు లక్ష్మిదేవి భూలోకాన్ని దర్శించి, శ్రీ గణేశ్‌ను తనతో తీసుకువస్తుంది.

అందుకే దీపావళికి లక్ష్మిదేవి, శ్రీ గణేశ్‌లను కలిసి పూజిస్తారు.

                                                                       Courtesy: Sri Pullaiah Soma

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

Comments

Popular posts from this blog

Amazing Child Artist and other stories-- Dr. Muralidhar

A B V High School Friends - Discussions (Questions were put by Dr.Muralidhar

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju