Stories of Inspiration

ఒక మనవరాలి కథ అనగనగా ఒక డెబ్బైయ్యేళ్ల తాత, ఒక ఏడేళ్ల మనవరాలు. సాయంకాలం ఆ తాత మనవరాలి చిటికెన వేలు పట్టుకుని అలా ఊరి బయట మర్రిచెట్టుకాడ ఉండే రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చి ఊరి పెద్దలతో కబుర్లలో పడిపోయేవాడు. ఆ మనవరాలు మాత్రం రచ్చబండ దిగి అక్కడే ఉన్న గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చూస్తుండేది. అలా నాలుగు రోజులు పుస్తకాలు చూశాక చదివి చూడాలనిపించింది. పిల్లల కథల పుస్తకం కనిపిస్తే చదివేసింది. టైమే తెలియలేదు. చీకటి పడ్డాక తాతవచ్చి చిటికెన వేలు అందిస్తే పుస్తకం మూసి తాతతో పాటు ఇంటికొచ్చేది. అలా అలా ఆ మనవరాలికి పన్నెండేండ్లు వచ్చేసరికి గ్రంథాలయంలో ఉన్న అన్ని పుస్తకాలూ చదివేసింది. కొత్తపుస్తకం ఒక్కటీ మిగల్లేదు. ఇక గ్రంథాలయానికి వెళ్ళాలంటే విసుగనిపించేది. తాతయ్యతో పాటు మర్రిచెట్టు కిందే కూర్చునేది. ఒక రోజు చీకటి పడింది. కళ్లు కనిపించని తాత చిటికెన వేలు పట్టుకుని దోవ చూపిస్తూ ఇంటికి తీసుకెళుతోంది. ఉన్నట్టుండి తాత ఆగిపోయి, “నేనొక గేయం మొదటి లైను చెబుతాను, నువ్వు దాన్ని పూర్తి చెయ్యగలవా? ఇది అందరికీ తెలిసిన గేయమే!" అని పద్యాల ఆటలోకి దిగాడు. “సరే! అని మనవరాలు కూడా ఆటలోకి దిగింది. “నాకే...