Related to Science

 గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొన్నది ఎవ్వరు .?

గురుత్వాకర్షణ సిద్ధాంతం తెలుసుకోవడం లో భారతదేశంలో ఏమైనా అధరాలు ఉన్నాయా ? 

ఐతే ఇది చదవండి మీ అనుమానం తొలగిపోతుంది.

గురుత్వాకర్షణ సిద్ధాంతం ( Law of Gravitation) కనుగొన్నది న్యుటనా!? ఇది పూర్తిగా అసత్యం. ఎందుకంటే ప్రాచీన భారతీయ గ్రంధాల నిండా గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి ప్రస్తావించబడి వుంది.

1) “సూర్య సిద్దాంత” మనే ప్రాచీన గ్రంధంలో ఇలా చెప్పబడింది. “ధారణాత్మక శక్తి కారణంగా భూమి ఆకాశంలో పడిపోకుండా నిలబడుతున్నది.

(సూ.సి. 12 అ – 32 శ్లోII)

శ్లో II మధ్యే సమన్తదన్నస్య భూగోళో వ్యోమ్ని తిష్టతిI

___బీభ్రాణః పరమాం శక్తిం బ్రాహ్మణో ధారణాత్మికామ్II

2) వరాహమిహురుడు (శాలివాహనాశకం . 505) తన “పంచ సిద్ధాంతి” అనే గ్రంధంలో గురుత్వాకర్షణ శక్తి గురించి  “భుతలంలోని ఏ భాగంలో అయిన .. అన్ని జ్వాలలు పైకేగుస్తాయి.. పైకి వేసిన వస్తువు కింద పడుతుంది. ఈ అనుభవం అందరికి తెలిసినదే. సమానమైనదే” అని అంటాడు.

(పం.సి. 13 అ – శ్లోII)

శ్లోII గగనము పైతి శిభిశిఖ క్షిప్తమపి క్షితముపితి గురు కించిత్I

___యధ్వదిహ మానవానాం అసురానం తద్వాదేవాజ్ఘః II

3) “లీలావతి” అనే గ్రంధంలో “భువనకోశం” అనే సర్గలో భాస్కరాచార్యుడు (శాలివాహనాశకం 1114) తన పుత్రిక లీలావతికి “భూమి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది. ఖగోళంలో గ్రహాల పరస్పర ఆకర్షణ శక్తి వల్ల అవి అక్కడ తమకు తామే ఆధారభూత మై నిలిచి ఉన్నాయని” చక్కగా వివరించారు.

4) “సిద్దాంత శిరోమణి” (భాస్కరాచారుడు) అనే గ్రంధంలో “భువనకోశం” అనే అధ్యాయంలో 6వ శ్లోకంలో గురుత్వాకర్షణ శక్తి గురించి చాలా చక్కగా వివరించారు.

శ్లోII ఆకృష్టిశక్తిశ్చ మహితయా యత్ స్వస్థం/గురు స్వాభిముఖం స్వశక్త్యా

___ఆకృష్యతే తత్పతతీవభాతి/సమే సమన్తాత్ క్వ పతత్వియం ఖేII

భూమి ఆకాశంలో ఉన్న వస్తువులను సహజంగా, స్వశక్తితో .. తన వైపునకు ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ వలన అన్ని వస్తువులు భూమి మీద పడతాయి. ఆకాశంలోని వివిధ గ్రహాల మధ్య సమాన ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు అవి ఎక్కడ పడతాయి.

5) బ్రహ్మగుప్తుడు (శాలివాహనాశకం.591) రచించిన “బ్రహ్మాస్పుఠ సిద్ధాంతం” లో “వస్తువులు భూమి వైపు ఆకర్షింపబడతా యి. నీటికి ఎలా సహజ ప్రవాహశక్తి ఉన్నదో, అలా భూమికి సహజమైన ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పారు.

6) జగద్గురువు అదిశంకరులవారు వారి “ప్రశ్నోపనిషత్” భాష్యంలో “అపాన” శక్తి గురించి రాస్తూ .. “ఒక వస్తువును పైకి ఎగురవేస్తే దానిని ఎట్లు భూమి ఆకర్షిస్తుందో, అటులనే పైకి లాగబడే “ప్రాణ” శక్తిని “అపాన” శక్తి కిందకు కిందకు లాగుతుంది.

(3-8 శ్లోII) అని చెప్పారు.

శ్లోII తధా పృధివ్యామభిమానినీ యా దేవతా ప్రసిద్ధా సైషా

___పురుషస్య అపానవృత్తిమవష్టభ్యాకృష్య వశీకృత్యాధ ఏవ

అపకర్షేణ హి శరీరం గురుత్వాత్ పతేత్ సావకాశే వోద్గాచ్చేత్II”

ఆ తరవాతి భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల గ్రంధాలలో కూడా “గురుత్వాకర్షణ” సిద్ధాంతం వివరింపబడి ఉంది. న్యుటన్ కి ముందే ఎన్నో వందల, వేల సంవత్సరాల పూర్వమే “గురుత్వాకర్షణ” గురించి భారతీయ విజ్ఞానం ఘోషించింది.

ఇంతటి విశిష్టమైన భారతీయ గొప్పతనాన్ని “జన విజ్ఞాన” సంఘం అంటూ చైనా శక్తులు భారతీయ విద్యా విధానం ఒక బూటకం అంటూ నిందలు వేస్తున్నారు. ఇది భారతీయులు సాధించిన విజయం.. మన పూర్వ గ్రంధాలను దోచుకువెళ్ళి ఆ గ్రంధాలపై విశ్లేషణ జరిపి విదేశాలలో చాలామంది మేమే గురుత్వాకర్షణ శక్తి కోసం కనిపెట్టి వివరించాము అని చెప్పుకోవడం హాస్యాస్పదం ..

ఈసారి ఎవ్వరైనా గురుత్వాకర్షణ శక్తి కోసం అడిగితే గర్వగా చెప్పండి “సూర్య సిద్దాంత” “పంచ సిద్ధాంతి” “లీలావతి” “సిద్దాంత శిరోమణి” “బ్రహ్మాస్పుఠ సిద్ధాంతం” “ప్రశ్నోపనిషత్” మా పూర్వికులు ఆ గురుత్వాకర్షణ శక్తి కోసం సరైన విశ్లేషణ ఇచ్చారు .. అంతకు మించిన సమాచారం ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు నేటికి ఇవ్వలేకపో యారు అని ...

మన భారతీయ చరిత్రను వక్రీకరించారు అనడానికి ఇది ఖచ్చితమైన ఉదాహరణ ... కాదంటారా ..???

(source : internet)

***********************************************************************************

వాగ్దేవతలు

*తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :

"అ" నుండి "అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండం అంటారు. ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధం.

"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని "సౌర ఖండం"అంటారు.

ఈ సౌరఖండం లోని "క, ఖ, గ, ఘ, జ్ఞ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత "కామేశ్వరి".! అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం

"చ, ఛ, జ, ఝ, ఞ" గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని".! అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.

"ట, ఠ, డ, ఢ, ణ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవతా శక్తి "విమల".! అంటే మలినాలను తొలగించే దేవత.

"త, థ, ద, ధ, న" వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత "అరుణ".! కరుణను మేలుకొలిపేదే అరుణ.

ప, ఫ, బ, భ, మ" అనే ఐదు అక్షరాలకు అధిదేవత "జయని." అనగా జయము ను కలుగ చేయునది.

అలాగే "మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని "అగ్ని ఖండం" అంటారు. అలాగే అగ్ని ఖండంలోని "య, ర, ల, వ" అనే అక్షరాలకు అధిష్టాన దేవత "సర్వేశ్వరి." అంటే శాశించే శక్తి కలది సర్వేశ్వరి.

ఆఖరులోని ఐదు అక్షరాలైన "శ, ష, స, హ, క్ష" లకు అధిదేవత "కౌలిని"

ఈ అధిదేవతలనందరినీ "వాగ్దేవతలు" అంటారు. ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని, క్రోమొజోములను ప్రభావితం చేస్థాయి.

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.

ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.

అంటే బ్రహ్మమే శబ్దము.

ఆ బ్రహ్మమే నాదము.

మనం నిత్యజీవితంలో సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.

అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది.

భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి "అమ్మ"ను అర్చిస్తున్నాయి.

కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.

మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను ఉద్దేశించి కాదు, మనం చదివే స్తోత్రమే ఆ దేవత.

మనం చేసే శబ్దమే...ఆ దేవత..!

మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.

ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.

ఇది సనాతన ధర్మం.

ఇది మనకు మాత్రమే పరిమితమైన అపూర్వ సిద్ధాంతం.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

                                                                   Sushruta





Comments

Popular posts from this blog

A B V High School Friends Stories -1

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju

Bhagavad-Gita (Purushottama Yoga 15.1 shloka