Stories of Inspiration

 ఒక మనవరాలి కథ 

అనగనగా ఒక డెబ్బైయ్యేళ్ల తాత, ఒక ఏడేళ్ల మనవరాలు. సాయంకాలం ఆ తాత మనవరాలి చిటికెన వేలు పట్టుకుని అలా ఊరి బయట మర్రిచెట్టుకాడ ఉండే రచ్చబండ దగ్గరకు తీసుకువచ్చి ఊరి పెద్దలతో కబుర్లలో పడిపోయేవాడు. ఆ మనవరాలు మాత్రం రచ్చబండ దిగి అక్కడే ఉన్న గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చూస్తుండేది. అలా నాలుగు రోజులు పుస్తకాలు చూశాక చదివి చూడాలనిపించింది. పిల్లల కథల పుస్తకం కనిపిస్తే చదివేసింది. టైమే తెలియలేదు. చీకటి పడ్డాక తాతవచ్చి చిటికెన వేలు అందిస్తే పుస్తకం మూసి తాతతో పాటు ఇంటికొచ్చేది. అలా అలా ఆ మనవరాలికి పన్నెండేండ్లు వచ్చేసరికి గ్రంథాలయంలో ఉన్న అన్ని పుస్తకాలూ చదివేసింది. కొత్తపుస్తకం ఒక్కటీ మిగల్లేదు. ఇక గ్రంథాలయానికి వెళ్ళాలంటే విసుగనిపించేది. తాతయ్యతో పాటు మర్రిచెట్టు కిందే కూర్చునేది.

ఒక రోజు చీకటి పడింది. కళ్లు కనిపించని తాత చిటికెన వేలు పట్టుకుని దోవ చూపిస్తూ ఇంటికి తీసుకెళుతోంది. ఉన్నట్టుండి తాత ఆగిపోయి, “నేనొక గేయం మొదటి లైను చెబుతాను, నువ్వు దాన్ని పూర్తి చెయ్యగలవా? ఇది అందరికీ తెలిసిన గేయమే!" అని పద్యాల ఆటలోకి దిగాడు.

“సరే! అని మనవరాలు కూడా ఆటలోకి దిగింది. 

“నాకే రెక్కలుంటే....” అనే గేయాన్ని తాత ఆరంభించాడు. మామూలుగా అయితే ఆ గేయం ఇదీ : 

‘నాకే రెక్కలుంటే నీలాకాశంలోకి ఎగిరిపోతాను

అందమైన చోట్లెన్నో చూస్తాను 

గొప్పవారిని కలుస్తాను 

గుప్తనిధులు వెతుకుతాను'

ఈ పద్యం మనవరాలికి తెలిసినా..., అప్పటికప్పుడు ఇలా సరికొత్తగా మొదలెట్టి.. 

“నాకే రెక్కలుంటే... 

పక్కూరి గ్రంథాలయానికెగిరి పోతాను 

మరిన్ని పుస్తకాలు చదివేస్తాను” 

అని చెప్పింది. 

ఆ చీకట్లో తాత కళ్లు మిలమిలా మెరిశాయి.

ఆ తాత ఆ మనవరాలితో ఆ రాత్రి పక్కమీద ఇలా అన్నాడు. "వంద సంవత్సరాలకు ముందు అమెరికాలో ఆండ్రూకార్నెజీ అని ఒకాయన ఉండేవాడు. ఆయన కోటీశ్వరుడు. చనిపోయేటప్పుడు ఆస్తి పిల్లలకు చెందాలని రాయలేదు. ఆ డబ్బుతో వీలైనన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు కట్టించాలని రాశాడు. నేను అమెరికా అయితే వెళ్ళి చూళ్లేదు గానీ అక్కడి గ్రామాల్లో కనిపించే ప్రతీ గ్రంథాలయం ఆయన డబ్బుతో కట్టించిందేనంటారు.

నీకు పుస్తకాలంటే ఎంతిష్టమో ఈ గేయాన్ని పూరించడం బట్టి తెలిసింది. నాకు మాటివ్వు. పెద్దదానివైన తర్వాత, నీ దగ్గర అవసరానికి మించిన డబ్బుంటే ఒక్క గ్రంథాలయానికైనా పుస్తకాలు కొనిస్తానని ప్రమాణం చెయ్యి."

ఆ మనవరాలు అమాయకత్వంగా ఆ తాత చేతిలో చెయ్యివేసింది.

ఆ పాప చదువుతూ చదువుతూ పెద్దదైంది. 1974 సంవత్సరానికంతా బెంగుళూరు ఐ.ఐ.ఎస్.సి. ప్రాంగణంలో ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయగలిగిన ఆడపిల్ల దేశంలోనే ఒక్కటే అయ్యింది.

ఇంకా ఇంకా పెద్దదైంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్ అయ్యింది, ఆ తాత మనవరాలు.

ఆమె పేరు - సుధానారాయణ మూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుమారు పదివేల గ్రంథాలయాలకు పుస్తకాలు కొనిచ్చి తాత కలను నెరవేర్చింది. సుధామూర్తిగారి కథలో తెలుసుకోవలసింది ఏమిటంటే - కనిపించిన మంచి పుస్తకమల్లా చదవబట్టే ఆమెకి ఐన్స్టీన్నీ, న్యూటన్నీ అవగాహన చేసుకునే శక్తి, పుష్టి కలిగాయి. ఆమె మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీరే కాదు. ప్రపంచంలోనే గొప్ప సృజనాత్మక శక్తిగా ఆవిర్భవించింది. ప్రపంచ విజయాలు సాధించేది ‘పుస్తకాల పురుగులే’ అని నిరూపించింది.

*_{"పూలు - పళ్ళు" అనే సంకలన పుస్తకం నుండి సేకరించిన అంశమిది. 🙏

ఇక ఇప్పుడు ఆ మనవరాలు గురించి మరికొంత సమాచారం..

                               

2024 మార్చి-08, మహిళా దినోత్సవం రోజున రాష్ట్రపతి కోటా కింద “సుధా మూర్తి” గారు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 

"సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధామూర్తి చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం” అని తనను రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు తెలిపారు.

Courtesy:  Smt. Yasaschandrika 

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

చాలామంది బతికేస్తుంటారు , కొందరే జీవిస్తుంటారు 

“ఈ వాన లో ఎక్కడికెళతారు ? మా ఇంట్లోనే వుండండి , '' అని ఆ నిరుపేద ఒడిషా కూలీ అన్నపుడు సుధా మూర్తి గారు ఆగారు.

ఆమె పేద పిల్లలకు ఉచిత బడి స్థాపించే పని మీద అక్కడికెళ్ళారు. 

“ఆమె మన అతిథి. ఆమె టీ , కాఫీ తాగరట. పాలు ఇవ్వు ” అని ఆ కూలీ అంటే..

“మన పాపకు ఆ ఒక్క గ్లాసు పాలే వున్నాయి. వాన పడుతోంది. ఆ పాలు ఆమెకిస్తే రాత్రంతా పాప ఏడుస్తుంది” అంది ఆమె.

“అయినా పరవాలేదు , సగం పాలకు సగం నీళ్ళు కలిపి , చక్కెరతో ఇవ్వు” అన్నాడు ఆయన. 

ఒరియా తెలిసిన సుధామూర్తి కి అది వినపడింది.

“ఈ రోజు బుధవారం , నేను ఉపవాసం. ఏమీ తీసుకోను” అంది ఆమె. 

“అందరూ సోమ , గురు , శుక్ర , శని వారాలు ఉపవాసం చేస్తారు. మీరు బుధవారం వుంటున్నారే ?” అని అతనంటే.. 

“అవును. నేను గౌతం బుద్ధుడి కోసం వుంటాను” అన్నారు ఆమె. ఆ రాత్రే ఆమె నిర్ణయం తీసుకొన్నారు. గుక్కెడు పాలు తాగలేని పసిపిల్లలు లక్షలమంది నా దేశం లో వుండగా , నేను పాలు తాగడమా ? వద్దు అని ఆనాటి నుండి ఆమె పాలు తాగడం మానేసారు.

TATA వారి TELCO లో భారతదేసపు మొట్టమొదటి మహిళా ఇంజినీర్ గా ఆమె ప్రవేశించినా , 2 , 21 , 501 మంది employees తో ఏటా 2.48 బిలియన్ US Dollars ఆదాయం కలిగిన Infosys నడిపే Infosys Foundation కు Chair Person అయినా , సుధామూర్తి simplicity కి మారు పేరులా వుంటారు. 

అమె దగ్గర వున్నది కేవలం 8 చీరలు మాత్రమే అంటే మనలో చాలామంది ఆశ్చర్యపోతారు. చివరగా ఆమె చీర కొన్నది 1998 లోనే. ఒక మారు ప్రపంచ ప్రసిద్ధ London Heathrow Airport లో అక్కడి ఇంగ్లీష్ వాళ్ళ మధ్య అతి సాధారణ దుస్తుల్లో వున్న సుధామూర్తి ని చూసి "ఇది ధనవంతులు ప్రయాణించే Business class. నీలాంటి వారు అదిగో అక్కడ మామూలు ప్రజలు వెళ్ళే Economy class వుంది వెళ్ళు" అని ఒక ఇంగ్లీష్ మహిళ అంటే , చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోయింది సుధా ముర్తి.

కానీ అదే రోజు 24 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఒక UNO సదస్సులో President హోదాలో అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అవాక్కయింది ఆ ఇంగ్లీష్ వనిత.

“నిజంగా గొప్పవారికి తాము గొప్పవారనే విషయమే గుర్తుండదు , అదే వారి గొప్పతనం,'' అంటాడు చైనా కు చెందిన లా తజు అనే ఒక ఫిలాసఫర్.

కేవలం 8 చీరలే కలిగిన సుధామూర్తి తన ఇంట్లో మాత్రం 20, 000 పుస్తకాలు కలిగి వున్నారు. తన ఆదాయాన్ని పేదల చదువుకు , అనాథలకు , ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు ఆమె.

ఖర్చు పెట్టడం వేరు, సరిగ్గా ఖర్చు పెట్టడం వేరు.

బతకడం వేరు, జీవించడం వేరు.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

🙏☘️☘️☘️🙏

ఆచమనం మంత్రాల భావం  


ఓం కేశవాయ స్వాహాః

 కేసి అనే రాక్షసుని చంపిన

 దైవానికి నమస్కారం 


 ఓం నారాయణాయ స్వాహాః

 చుట్టూ నీటి మధ్యలో ఉన్న

 దైవానికి నమస్కారం 


 ఓం మాధవాయ స్వాహాః

 మాధవి (లక్ష్మీదేవి) భర్తకు

 నమస్కారం


ఓం గోవిందాయ నమః

 గోవులను రక్షించు  

దైవానికి నమస్కారం  


ఓం  విష్ణవే నమః

 విశ్వమంతా నిండిఉన్న 

దైవానికి నమస్కారం


ఓం మధుసూదనాయ నమః 

 మధు అనే రాక్షసుని చంపిన

దైవానికి  నమస్కారం  


ఓం త్రివిక్రమాయ నమః  

3 లోకాలను ఆక్రమించిన 

దైవానికి నమస్కారం


ఓం వామనాయ నమః

వామన  అవతార రూప  

దైవానికి నమస్కారం


ఓం శ్రీధరాయ నమః

లక్ష్మీని వక్షస్థలాన ధరించిన

 దైవానికి   నమస్కారం 


ఓం హృషీకేశాయ నమః

ఇంద్రియాల అధిపతి

దైవానికి నమస్కారం  


 ఓం పద్మనాభాయ నమః

నాభిలో పద్మం కలిగిన

దైవానికి నమస్కారం


 ఓం దామోదరాయ నమః

 కడుపు చుట్టూ  తాడు

కడుపులో  లోకాలున్న 

దైవానికి నమస్కారం


ఓం సంకర్షణాయ నమః

ప్రళయాన అన్నీ ఆకర్షించి

మింగే దైవానికి  నమస్కారం


ఓం వాసుదేవాయ నమః 

వసుదేవ సుతునికి నమస్కారం  


ఓం  ప్రద్యుమ్నాయ నమః 

తేజో రూపునకు  నమస్కారం


ఓం అనిరుద్దాయ నమః 

ఎవరూ  జయించ లేని 

దైవానికి నమస్కారం


ఓం  పురుషోత్తమాయ నమః

ఉత్తమ దైవానికి  నమస్కారం. 


ఓం అధోక్షజాయ నమః

భూమి ఆకాశం మధ్యవున్న

దైవానికి నమస్కారము


ఓం నారసింహాయ నమః

 నర+సింహ రూపంలో ఉన్న 

దైవానికి నమస్కారము


ఓం  అచ్యుతాయ నమః

 నశించని దైవానికి నమస్కారం  


ఓం జనార్ధనాయ నమః 

 జనులు మేలు కోరి పూజించే

దైవానికి   నమస్కారము


ఓం  ఉపేంద్రాయ నమః

 ఉప+ఇంద్ర = ఉపేంద్ర 

ఇంద్రుని తమ్మునికి నమస్కారం


ఓం హరయే నమః

 ప్రళయాన అంతా 

 విష్ణువుకు నమస్కారం


ఓం శ్రీకృష్ణాయ నమః

అంతా ఆకర్షించు నల్లని

దైవానికి  నమస్కారం 


🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

A B V High School Friends Stories -1

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju

Bhagavad-Gita (Purushottama Yoga 15.1 shloka