A B V High School Friends Stories -1



A.B.V.High School Group Photo 1966 and 1967 batches


Q1. Explain ( Task given by  Sri Dr. Muralidhar 5th November 2023

            కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి

           కరమూలే భవే గౌరీ ప్రభాతే కర దర్శనం II

Comment by Sri.Mahendra Raju

1.చేయి వేళ్లు చివర్లు పని చేయడానికి ఉపయోగిస్తాం కదా .. పని చేస్తేనే డబ్బులు కదా .. అందుకే లక్ష్మి కరాగ్రే .. లక్ష్మి ధనానికి ప్రతీక కాబట్టి ..

అర చేయి మధ్య లో పుస్తకం పట్టుకుంటాం కదా చదవడానికి .. అందుకే సరస్వతి కర మధ్యే .. సరస్వతి జ్ఞానానికి ప్రతీక కాబట్టి ..

అర చేయి చివర్లో ఏది పట్టుకోవాలన్న బలం ఆధారం అక్కడనుంచే .. అందుకే కర మూలే గౌరీ .. గౌరీ శక్తి కి ప్రతీక కాబట్టి ..  

2. Comment by Smt.Sukumari

At end of the palm (at the end of finger tips goddes Lakshmi Devi resides, in the middle of the palm goddess Saraswati resides at the end of the palm goddess Gowrie Devi resides and therefore we have to see our palm immediately after weak up from the bed in the morning.

3. comment by Smt. Lalasa

            కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి

           కరమూలే భవే గౌరీ ప్రభాతే కర దర్శనం II

సంపదలనిచ్చు తల్లి లక్ష్మీ devi మన చేతి వేటి కొనల మీద నివసిస్తే, సరస్వతీ దేవి చేయి మధ్య భాగంలో , చేతి మూల ప్రదేశంలో పార్వతీ దేవి ఉంటుంది. అందుకనే ప్రొద్దున్నే చేతులను దర్శించుకోవాలి అని భావం.

అంటే ముగ్గురు దేవతలు అన్ని సంపదలిచ్చే అంటే ధనం, ధాన్యం, పశు సంపద మొదలైనవి ఇచ్చే లక్ష్మీ దేవి, అన్ని విద్యలను ( చక్కగా మాట్లాడడం,మంచి ఇతరులని ముగ్ధింప చేసే భాష,కవిత్వం మొదలైనవి )  ఇచ్చే సరస్వతీ దేవి, ఏ పని చేయాలన్నా మనకి శక్తి కావాలి, చేయి పైకెత్తాలన్నా, క్రిందకి దింపాలన్నా, ఏదైనా వస్తువుని పట్టుకోవాలి అన్నా మనకి శక్తి అవసరం. శక్తి లేకుండా మనం ఉండలేము. ఆ శక్తినిచ్చే తల్లి పార్వతీ దేవి మన చేతిమూలం లో ఉంటుంది. ఇలా ముగ్గురు దేవతలు మన చేతులలోనే ఉన్నారు అనే భావనతో మనము కళ్ళు తెరవగానే మన చేతులు మనం చూసుకోవాలి అని మన సనాతన ధర్మం  చెప్తుంది. 

ఆధ్యాత్మికపరంగా మనం ఉదయం లేవగానే భగవంతుని తలుచుకుంటే మన మనస్సులో కూడా సద్భావనాలు వస్తాయి. దీనిమూలంగా మనలో పాజిటివ్ స్పందనలు కలిగి మన పనులు  మనం సంతోషంగా ఆహ్లాదం గా చేసుకోవచ్చును. ఇందులో ప్రతి పదం ఒక మంత్రం. మంత్రమనగానే అందులో శక్తి ఉంటుంది. ఆ శక్తి మనలోకి వస్తుంది.ఇందులో "కర"  అనే శబ్దం  మళ్ళీ మళ్ళీ వస్తుంది. అంటే ఈ శబ్దం అంటే '' అనబడే అక్షరం, '' అనబడే అక్షరం రెండు కూడా స్వరపేటిక (వోకల్ కార్డ్స్) ని activate  చేస్తాయి. రాత్రంతా స్వరపేటిక కూడా విశ్రాంతి తీసుకుంటుంది కదా !  అది ఇంకొక లాభం. ఉదా : చంటి పిల్లవాడు కా ..ర్  అని ఏడుస్తాడు  అప్పుడు కూడా స్వరపేటిక ఆక్టివేట్  అవుతుంది.

విజ్ఞానపరంగా చూస్తే రాత్రంతా మనం కళ్ళు మూసుకుని ఉంటాం. అంటే శక్తి అంతా మన శరీరం లో ఉండి పోతుంది. మనం కళ్ళు తెరవ గానే ఆ శక్తి అంతా బయటకి వెళ్ళిపోతుంది. పూర్వ కాలంలో తపస్సు చేసుకునే ఋషులు కళ్ళు తెరిచి  కళ్ళతో చూస్తే ఆ ఎదుటి మనిషి భస్మయి పోయే వాడు. కౌశికత్సుడు కోపంగా కాకిని చూడగానే కాకి మలమల మాడిపోయి క్రింద పడిపోతుంది. అలా కళ్ళలో అంత శక్తి ఉంటుంది. కళ్ళు తెరిచి మన చేతులను ఈ శ్లోకం చదువుకుంటూ మనం చూసుకుంటూ ఉంటె ఆ శక్తి   బయటకి వెళ్లకుండా మళ్ళీ మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. కొంత శక్తి వాతావరణంలోకి తిరిగి వెళ్లినా.

ఇంకొక లాభం ఏమిటంటే కళ్ళని ఒక సారి వేళ్ళ చివరకి, ఒకసారి మధ్యలో, ఒకసారి అడుగుభాగానికి అంటే పైకి క్రిందకి తిప్పడం మూలంగా మనకు తెలియకుండానే కళ్ళకి ఒక వ్యాయామం అవుతుంది.

Comment by Sri Dr. Muralidhar through voice record.

హరి ఓం ! మిత్రులందరికీ నా నమస్కారములు. నిన్న నేనడిగిన ప్రశ్నకి మంచి స్పందన వచ్చింది. అందరికి ఈ శ్లోకం అర్థమయింది. అయితే దానికి ప్రప్రథమంగా కరెక్టుగా జవాబు ఇచ్చిన మిత్రుడు   మహేంద్ర రాజు. అతను ఇచ్చిన జవాబు చాలా కరెక్ట్ గా ఉంది. Congratulations  మహేంద్ర !! లాలసమ్మ కూడా సరిగ్గానే వ్రాసింది. నీ విశ్లేషణ వేరే విధంగా ఉంది. కంగ్రాట్స్ లాలస !

ఈ శ్లోకం   మనం చేసే కార్యాలన్నిటిని చెప్తుంది. మనం సంపాదన చేసినా, ఖర్చుపెట్టినా చేతులమీదుగానే జరుగుతుంది. ఇందులో అంటే ఈ శ్లోకంలో  క్లుప్తమైన జ్ఞానం ఉంది. అదేమంటే  లక్ష్మి చంచల స్వభావం కలది. ఒక చోట నిల బడదు. అందుకే మన చేతిలో డబ్బు ఉంటేనే ఏదైనా ఒక వస్తువు వస్తుంది. అయితే  ప్రతి రోజు మనం డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాం. మనం పూర్వజులు ఏమంటారంటే లక్ష్మి నీ కరాగ్రంలో  ఉంది. అందుకనే రోజు లక్ష్మి దేవిని పూజించు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి . ఆమె స్వభావాన్ని గుర్తు పెట్టుకోండి. లక్ష్మి దేవి ఎక్కడా స్థిరంగా నిలబడదు. బాగా డబ్బులున్నాయని గర్వ పడకు. ఇది మొదటిదానికి అర్థం.

సరస్వతి దేవి మనం చేతి  మధ్యలో ఉంది. మనం చేతి మధ్యలో ఉన్న వస్తువు జారీ పోదు. అలాగే మనకు వచ్చిన విద్య మననుంచి జారిపోదు. అందుకనే సరస్వతి దేవి మధ్యలో ఉంది.

మనం చేతిలోనే నాలుగు వేళ్ళకు బొటనవేలు కలిపితేనే శక్తి వస్తుంది. అక్కడే పార్వతి దేవి ఉంటుంది. ఇలా కరాగ్రంలో లక్ష్మి, మధ్యలో సరస్వతి, మూలంలో పార్వతి దేవి ఉంది. కరాగ్రే లక్ష్మి ఉంది . ఆవిడ స్వభావం తెలుసుకుని  పూజించండి. ఇదే క్లుప్తంగా అర్థం.


Comments

Popular posts from this blog

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju

Bhagavad-Gita (Purushottama Yoga 15.1 shloka