Miscellaneous - Sujata and others
ప్రియమైన సహ జిజ్ఞాసులారా! నమస్కారం. గీతా సారాంశము రెండు పదాలలో ఉంది - అవి ఏవి? అన్న ప్రశ్నను పరిశీలిద్దాం:
భగవద్గీతలో మొదటి శ్లోకం (1-1) ధృతరాష్ట్రుడు పలికినది:
"ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవా శ్చైవ కి మకుర్వత సంజయ"
ఈ శ్లోకం “ధర్మక్షేత్రే” అన్న పదబంధంతో ప్రారంభమయింది. ఈ సమాసంలో మొదటి పదము ‘ధర్మ.’ ధర్మ రూపంలో ఉండేది, ఉన్నది దైవమే. ధరించునది ధర్మం (ధరతీతి ధర్మః). ప్రపంచానికంతటికీ ధర్మమే ఆధారమని (ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా) తైత్తిరీయ ఉపనిషత్తు చెబుతోంది. అందుకని ధర్మం అనేది భగవద్విభూతియే. భగవంతుని రూపమే. ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడనీ, ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటే అక్కడ ‘జయము’ ఉంటుందని వ్యాసవాణి. ఈ విధంగా ప్రథమ శ్లోకం “ధర్మ” తో ప్రారంభమై, “జయ” అనే పదంతో ముగిసింది. అంటే – ధర్మమే గెలిచి తీరుతుంది (ధర్మమేవ జయతే) అన్న ఆర్షోక్తిని ఈ శ్లోకం చక్కగా ఆవిష్కరించింది.
ఇక, గీతలో చివరి శ్లోకము (18-78) లోని చివరి పదము “మమ.”
"యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్థరః
తత్ర శ్రీ ర్విజయో భూతిః ధ్రువా నీతి ర్మతి ర్మమ"
ఈ రెండూ – అంటే, మొదటి శ్లోకంలో మొదటి పదం, చివరి శ్లోకంలో చివరి పదం - చేరిస్తే 'మమధర్మ (my duty)' ఏమిటో భగవద్గీత బోధించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలని గీత బోధిస్తోంది. ఇదీ – “మమ, ధర్మ” అన్న రెండు పదాలలో గీతా సారాంశం. 🕉🙏
----- Sujata
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
💎🌅 -|¦¦|శుభోదయమ్|¦¦|- 🌄🪔
🪔 𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝 💎
శ్లో॥ స్వధీతస్య సుయుద్ధస్య సుకృతస్య చ కర్మణా|
తపసశ్చ సుతప్తస్య తస్యాన్తో సుఖమేధతే||
తా|| "కష్టపడి నేర్చుకున్న విద్య, నేర్పుగా చేసిన యుద్ధం, శ్రద్ధాసక్తులతో జాగ్రత్తగా చేసిన పని, నియమనిష్టలతో చేసిన పూజ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి.... కనుక మంచి ఫలితం రావాలంటే ఎప్పుడూ, జాగ్రత్తగా, శ్రద్ధగా, పనిచేయాలి"
✍️🌹🌷💐🙏
***********************************************************************************
స్త్రీ జన్మ....??
➖➖➖✍️
ధర్మరాజుకొక ధర్మసందేహం వచ్చింది. ‘స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం వుంటుంది’ అని. ఇదే విషయం భీష్ముడిని అడిగాడు.
దానికి భీష్ముడు నవ్వి “నీకొక కథ చెబుతాను. అందులో
సమాధానం దొరకవచ్చు” అని చెప్పడం ప్రారంభించాడు…
పూర్వము భంగస్వనుడు అనే రాజు వుండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్య సంధుడు. ప్రజలను కన్న బిడ్డల కన్న మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానము కలుగ లేదు.
‘అపుత్రస్య గతిర్నాస్తి’ట అని పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడయినా లేడే అనే బాధతో అగ్ని దేవుడిని ప్రార్ధించి అగ్నిస్తుత యజ్ఞం చేసాడు. అగ్ని దేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు.
విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజయిన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞము చేసి నూరుగురు కుమారులను కన్నందుకు ఆగ్రహం తెప్పించింది.
అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలనుకున్నాడు. తగిన సమయం కోసం వేచివున్నాడు.
ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్లాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలా చేసాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటోతీసుకుని వెళ్ళింది.
ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది.
వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్పటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు.
మునిగి పైకి లేచే సరికి ఆ రాజు ఆశ్చర్య కరంగా స్త్రీ గా మారిపోయాడు. అయాచితం గా ప్రాప్తించిన స్త్రీత్వానికి చాలా చింతించాడు.
“ఈ రూపముతో రాజధానికి వెళ్ళి నేను నా భార్యా పిల్లలకు, పుర జనులకు ఎలా ముఖము చూపించగలను !? " అని విచారించి...
“అయినా ఇలా అడవిలో ఉండలేను కదా !" అనుకుని చివరకురాజధానికి వెళ్ళాడు.
ఓ5మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కొడుక్కి రాజ్యాభిషిక్తుడిని చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించ సాగాడు.
కాలక్రమంలో, ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ మునివలన అత్యంత బలసంపన్నులైన నూరుగురు కుమారులను పొందాడు.
వారు పెరిగి పెద్దయిన తరువాత ఆ నూరుగురు కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో....
"కుమారులారా ! నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను. స్త్రీగా ఉన్నప్పుడు ఈ నూరుగురు కుమారులను పొందాను. కనుక వీరు కూడా మీ సోదరులు. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకుని పాలించండి" అంది.
స్త్రీ గా మారినా ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృ వాక్య పాలకులుగా తండ్రిమాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకుని పాలించసాగారు.
ఇది చూసిన ఇంద్రుడు ‘నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది
అతడికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య బేధము కల్పించాలని’ సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి.... "రాజకుమారులారా ! ఏమిటీ వెర్రి ఎవరో ఎవరినో తీసుకు వచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మడమేనా!? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు?" అని వారిలో కలతలు రేపాడు.
అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నపుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేని పోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు.
అన్నదమ్ములు బద్ధశత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చని పోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకుని రోదించసాగింది.
ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరల ఏమీ ఎరుగని వాడిలా బ్రహ్మణ రూపుడై...“అమ్మా నీవు ఎవరవు?ఎందుకిలా రోదిస్తున్నావు?" అని అడిగాడు.
అప్పుడు ఆమె తాను యజ్ఞము చెయ్యడము కుమారులను కనడము అడవిలో దారి తప్పి కొలనునీరు త్రాగి స్త్రీగా మారడము మునిద్వారా కుమారులను కనడము పూసగ్రుచ్చినట్లు చెప్పింది.
అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై .. "రాజా ! నేను ఇంద్రుడను. నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను" అని చెప్పాడు.
దానికి ఆమె "దేవా ! అజ్ఞానంతో తెలియక పొరపాటు చేసాను. అయినా దేవతలకు అధిపతి వైన నీవు పగ తీర్చుకోడానికి నేను తగిన వ్యక్తినా ! కనుక నన్ను దయతో రక్షించు" అని వేడుకోగా....
ఆ మాటలకు కరిగి పోయిన ఇంద్రుడు "రాజా ! నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రుల నైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను ఎవరు కావాలో నీవే ఎంచుకో " అన్నాడు.
ఆమె (భంగస్వనుడు) సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంది.
"అదేమిటి రాజా ! మిగిలిన వారు నీ కుమారులు కాదా !?" అని అడిగాడు.
భంగస్వనుడు "వారు కూడా నా పుత్రులే వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా !” అని చెప్పింది.
ఇంద్రుడు సంతోషంతో "రాజా ! నీ సత్యనిష్టకు సంతోషించాను. నీకుమారులు అందరినీ బ్రతికిస్తాను" అని... “రాజా ! నీకు ఇంకొక వరము ఇస్తాను నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగిఇస్తాను" అన్నా దానికి ఆమె "మహేంద్రా ! నా కుమారులను బ్రతికించావు అదే చాలు స్త్రీగానే ఉంటాను" అంది.
ఇంద్రుడు ఆశ్చర్యంతో "అదేమిటి రాజా ! పురుషుడవైన నీవు స్త్రీగా ఉండి పోతాననడానికి కారణం ఏమిటి ? " అని అడిగాడు.
స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గు పడి "మహేంద్రా ! నేను స్త్రీగా ఉండడంలో ఆనంద పడుతున్నాను. ఇందులో వున్న తృప్తి నాకు పుంసత్వములో కనబడలేదు కనుక ఇలాగే ఉండి పోతాను" అంది.
దేవేంద్రుడు నవ్వి “అలాగే అగుగాక”అని ఆశీర్వదించాడు.
అని పై కథంతా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు.. “యుధిష్టిరా! ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం !” అని అడిగాడు.
స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమయిన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు.
“ఒకతెకు జగములు వణకున్ అగడితమై
ఇద్దరు కూడిన అంబులు ఇగురున్। ఓముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరాపట్టపగలె చుక్కలు రాలున్ ..!”
[ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి.
అంటే స్త్రీ చాలా శక్తివంతురాలని భావము]✍️
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*********************************************************************************
మిత్రులందరికీ🌷
🌞 భాస్కరస్య యథా తేజః
మకరస్థస్య వర్ధతే।
తథైవ భవతాం తేజః
వర్ధతామితి కామయే।🌞
🎋మకరరాశిలో ప్రవేశించిన సూర్యునియొక్క తేజస్సు దినదిన ప్రవర్ధమానమగుచున్నట్లుగా మీరు మంచి అభివృద్ధితో ప్రకాశించాలని, ఈ సంక్రాంతి పండుగ మీకు మంచి ఆరోగ్యాన్ని సంపదను, ఆనందాన్ని తీసుకురావాలని 🎋
మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబానికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు💐
--- Dr. Mahendra Raju
***********************************************************************************
Good morning!🌹🌹🌹
A small story from Padmavati
The father was reading newspaper. His six year old daughter insisted him to play with her. The father was too obsessed with the newspaper. But the child kept on insisting, "Dad, play with me." Just then the father noticed there was a full page advertisement of an international courier company stating, they deliver the goods in all parts of the world and a world map was printed there. In a moment of situational brilliance, the father immediately took that sheet of paper, tore it into multiple pieces, scattered it all over the floor and told his daughter, "Darling, this is your jigsaw puzzle. Assemble the world map together. Once you are done, dad will play with you!!!"
Within ten minutes the child had assembled the entire world map together. The father was stunned to see the map. He knew, he couldn't have done that. Looking at the expression, the child said, "I know why you are looking so shocked. When you were tearing the paper, I saw a face of a man on the other side. I don't know where Korea should be, where Sri Lanka should be, where Canada should be. But I know where eyes should be, where nose should be, where ears should be." It seems the child said on behalf of all of us, "I got the man right, the world became right." Get the man in you right and collectively when all of us get ourselves right, the world will become right!!! - Mahatria
**********************************************************************
An article posted by Mr.Chiluveru Madhusudan
మీ తర్వాతి తరానికి ఉజ్వల భవిష్యత్తు కోసం చదవడానికి రెండు నిమిషాలు కేటాయించండి.
ఆచార్య రజనీష్‌ను అతని అనుచరుడు ఒకరు ప్రశ్నించారు.
👉ప్రశ్న - జిహాదీలు ఇళ్లు, ఆస్తులు తగులబెట్టినప్పుడు, హత్యలు జరిగినప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి? మనం హిందూ ముస్లిం సోదరభావాన్ని పెంపొందించాలా లేక మన భద్రత కోసం ఏదైనా చర్య తీసుకోవాలా? దయచేసి గైడ్ చేయండి.👌
👉సమాధానం - 🙏 మీ ప్రశ్న మీ మూర్ఖత్వాన్ని తెలియజేస్తోంది,
మీరు చరిత్ర నుండి ఏమీ నేర్చుకోనట్టున్నారు.
మహమూద్ గజని సోమనాథ్ ఆలయంపై దాడి చేసినప్పుడు, ఆ సమయంలో భారతదేశంలో సోమనాథ్ అతిపెద్ద మరియు ధనిక దేవాలయం. ఆ గుడిలో పూజలు చేస్తున్న 1200 మంది హిందూ పూజారులు, మనం రాత్రింబగళ్లు ధ్యానం-భక్తి-పూజలో నిమగ్నమైతే దేవుడు మనల్ని కాపాడతాడని భావించారు. అతను రక్షణ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు, దానికి విరుద్ధంగా, తమను తాము రక్షించుకోగలిగే క్షత్రియులు కూడా నిరాకరించారు.
ఫలితంగా, మహమద్ గజిని వేలాది మంది నిరాయుధ హిందూ పూజారులను చంపి, విగ్రహాలు మరియు దేవాలయాలను ధ్వంసం చేసి, చాలా సంపద, వజ్రాలు, నగలు, బంగారం మరియు వెండితో పారిపోయాడు.
భగవంతుని ధ్యానం మరియు భక్తితో ఆరాధించడం అతన్ని రక్షించలేకపోయింది.
👉ఇవాళ వందేళ్ల తర్వాత కూడా అదే మూర్ఖత్వం కొనసాగుతోంది, మీ మహానుభావుల జీవితాల నుంచి మీరు ఏమీ నేర్చుకోనట్టున్నారు.
👉ధ్యానం దుర్మార్గుల హృదయాలను మార్చగలిగేంత శక్తివంతమైతే, శ్రీ రామచంద్రు నికి తన వెంట ఎల్లవేళలా విల్లు, బాణాలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ధ్యానం యొక్క శక్తితో, అతను రాక్షసుడు రావణుడి హృదయాన్ని మార్చగలవచ్చు గదా..
అతను సుర-అసురను సోదరులుగా భావించి ఉంటే వైరం ముగిసి ఉండేదా?
కానీ రాముడు కూడా ఎవరినీ ఒప్పించలేకపోయాడు మరియు రామ-రావణ యుద్ధం ఆయుధం ద్వారానే నిర్ణయించబడింది
👉ఇతరుల మనసు మార్చగలిగేంత శక్తి మనసుకి ఉంటే పూర్ణావతారం శ్రీకృష్ణుడికి కంసుడిని, జరాసంధుడిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది ? అతను వాటిని జాగ్రత్తగా మార్చే వాడుగా.
👉ధ్యానానికి ఇతరుల మనసు మార్చే శక్తి ఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు, కృష్ణుడు దుర్యోధనుని స్థానంలో తన ధ్యాన శక్తితో యుద్ధాన్ని నివారించగలిగేవాడు, కానీ దానికి విరుద్ధంగా, కృష్ణుడు అర్జునుడిని కోరుకోకుండా ఆపాడు. ధ్యానం చేసి అతనిని యుద్ధంలో నిమగ్నం చేసాడు.
👉మహాభారత యుద్ధం చరిత్రలో కోట్లాది మందిని చంపిన అతిపెద్ద యుద్ధం, గత 1200 సంవత్సరాలలో భారతదేశంలో ఎంత మంది మహర్షి సాధువులు ఉన్నారు, గోరఖ్‌నాథ్ నుండి రైదాస్ వరకు శక్తి మరియు కబీర్ నుండి గురునానక్ నుండి గురు గోవింద్ సింగ్ వరకు ఈ ముస్లిం ఆక్రమణదారులు మరియు బ్రిటీష్ వారందరూ. శ్రద్ధ. ఈ సమయంలో లక్షలాది మంది హిందువులు చంపబడ్డారు మరియు వారి మతాన్ని కత్తితో బలవంతంగా మార్చారు.
అతన్ని చంపి ఇస్లాంలోకి మార్చారు
ఆ సాధువుల ప్రబోధనలు ఆక్రమణదారులను మార్చలేకపోయింది. గురునానక్ తన మత తత్వశాస్త్రాన్ని ముస్లింలు సులభంగా అర్థం చేసుకునేలా మరియు గ్రహించగలిగే విధంగా అందించారు. కానీ అదే గురు సంప్రదాయంలో, గురుగోవింద్ సింగ్ ముస్లింలపై కత్తి పట్టవలసి వచ్చింది హిందూ మతాన్ని రక్షించడానికి, నిరాయుధులైన సిక్కులు ఆయుధాలు పట్టవలసి వచ్చింది.
ధ్యానం ద్వారా ఒక వ్యక్తి తన చైతన్యాన్ని మార్చుకోగలడని దీని నుండి స్పష్టమవుతుంది.
👉కానీ ఈ విషయంలో (భౌతిక శరీరం) మనల్ని మనం రక్షించుకోవాలి, అందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయం తీసుకోవాలి.
దేశంలోని 70% కంటే ఎక్కువ సమస్యలను పరిష్కరించడం.👌
శ్రీ కృష్ణ భగవానుడు 5 గ్రామాలను కోరాడు!
దేశ ప్రయోజనాల కోసం 5 చట్టాలు అడుగుతున్నాం!!
👉సమాన విద్య👌
👉యూనిఫాం సివిల్ కోడ్👌
👉 మత మార్పిడి నియంత్రణ👌
👉దేశం లోకి అక్రమ చొరబాటు నియంత్రణ👌
👉జనాభా నియంత్రణ👌
ఈ ఐదు చట్టాలు రాకపోతే ఇప్పుడు భారతదేశంలోని తొమ్మిది రాష్ట్రాల మాదిరిగానే సనాతనధర్మం ప్రపంచం మొత్తం నశించిపోతుంది.
సేవ్ ఇండియా ఉద్యమం
మన దేశాన్ని మరియు మన సోదరీమణులు/కూతుళ్లను రక్షించే ఉద్యమం
మీరు దీన్ని ఫార్వార్డ్ చేయరని నాకు తెలుసు, మీరు చదివిన తర్వాత వెళ్లిపోతారు. కనీసం ఒక్క వ్యక్తికి ఈ సందేశం పంపమని నేను మిమ్మల్ని కోరుతున్నాను, మీకు ఇబ్బందిగా ఉంటే దాన్ని నాకు తిరిగి పంపండి, గొలుసును విచ్ఛిన్నం చేయవద్దు.
మీరు అంగీకరిస్తే చదవండి దయచేసి ఫార్వార్డ్ చేయండి**🙏🏽
😡🚩😠🚩😡 హిందువులు ఎంతమంది ఐక్యంగా ఉన్నారో ఈరోజు మీకే తెలుస్తుంది!!!!
వందేమాతరం🇮🇳🇮🇳
*మేలుకో...హిందువు.....మేలుకో.....
భారత్ మాతాకీ జై🙏🏽
సేకరణ...
**************************************************************************ఎవరైనా తపస్సు చేస్తే ఎప్పుడూ అది ఇంద్ర పదవికే అని ఎందుకు ఇంద్రుడి భయం? అది శాశ్వత పదవి కాదా? అలా అయితే ఆ పదవిని ఇంకెవరైనా అలంకరించారా ?
https://youtube.com/shorts/Rm80xjwrk3s?si=p_VAbIqCD5wPVeEF
అది భయం కాదండి. ఇంద్రుణ్ణి మన సినిమా వాళ్ళ పైత్యంతో అలా చూపించారు . అదే నిజమని మనం ఇప్పటి నమ్ముతున్నాము. ఇంద్ర పదవి సామాన్యమైనది కాదు . ఎన్నో వేల యజ్ఞ యాగాలను చేస్తే ఇంద్రపదవి దక్కుతుంది.సాధారణంగా ఇంద్రుడు అన్నది స్వర్గాధిపత్యము అన్న పదవిని సూచిస్తుంది. కానీ సందర్భోచితంగా ఇంద్రపదవిలో ఉన్నవారందరినీ ఇంద్రుడు అనే సంబోధించడం తరచూ కనిపిస్తుంది. ఇంద్రపదవి ప్రతి మన్వంతరానికి మారుతుంటుంది.
ఉత్తమ మన్వంతరములో సుశాంతుడు
రైవత మన్వంతరములో విభుడు
చాక్షుష మన్వంతరములో మనోజవుడు
సావర్ణి మన్వంతరములో బలి చక్రవర్తి
ఇంద్రపదవిని ధరించారు.
ఇంద్రుడు దేవతలందరికీ రాజు / అధిపతి. అడ్మినిస్ట్రేటర్ అనుకోండి. ఆయన విధుల్లో ఒకటి టెస్ట్ చేయడం. ఆయన ఎవరైనా తపస్సు చేస్తుంటే ఆ చేస్తున్నవారు కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలకి లొంగుతాడా లేదా అని చూస్తాడట . దేనికి లొంగని వాడే ఆ తపస్సు యొక్క ఫలితాన్ని పొందడానికి అర్హుడు. అర్హుడు కాని వాడు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి.
ఉదాహరణకి విశ్వామిత్రుడంతటి బ్రహ్మర్షికే ఇంద్రుడి పరీక్షలు తప్పలేదు.మొదట తపస్సు చేసినప్పుడు మేనక అందానికి దాసోహమై అప్పటి దాకా సంపాయించిన తపస్సు ఫలితాన్ని ఖర్చుచేసేసాడు. ( మోహానికి లొంగాడు) మళ్ళీ తప్పు తెలుసుకుని రెండో సారి మొదలెట్టాడు తపస్సు. ఈ సారి తపస్సు భగ్నం చేయమని ఇంద్రుడు రంభను పంపాలనుకుంటే..నేను పోను అందిట . ఒక సారి ఎవరన్నా తప్పు చేస్తారు మళ్ళీ మళ్ళీ చేయరు. నేను వెళ్తే ఆ ముని శాపానికి గురి కావాల్సి వస్తుందని అంటే..లేదు నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే అంటే వెళ్ళింది. ఒక సారి మీ మాయ లో పడితే మళ్ళీ ఇదే లాగ నన్ను ఇబ్బంది పెడతారా అని రంభను శపించాడు. ఆమె పదివేల సంవత్సరాలు పాషాణ రూపంగా మారిపోయేటట్లు శపిస్తాడు సంవత్సరాల తపఃఫలితం మళ్ళీ o అయింది.( క్రోధానికి లొంగాడు) మళ్ళీ మొదలెట్టాడు. ఈ సారి కుంభకం అనే ప్రక్రియను ఉపయోగించి శ్వాస తీసుకోవడం విడిచి పెట్టడం మానేస్తాడు. ఆవిధంగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే శరీరం కాష్ఠం క్రింద (ఒక పుల్ల లా) మారిపోయింది.
చివరికి అన్ని విడిచిపెట్టి బ్రహ్మర్షి అయ్యాడు. ఆయనకు అడుగడుగునా పరీక్షలు పెట్టి అంతటి బ్రహ్మర్షి అవడానికి ఒక విధంగా కారణం అయింది ఇంద్రుడే. కాబట్టి మన పురాణాల్లో ఏది ఉందో తెలుసుకోవాలి కాని వెళ్ళిష్టం వచ్చినట్టు తీసే సినిమాలు చూసి కాదని నా అభిప్రాయం. తప్పులుంటే పెద్దలు సరిదిద్దండి.ఈ ప్రశ్నను అడిగినవారికి ధన్యవాదాలు. ......venkatalajshmi
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
#నవగుంజర ఇది ఎప్పుడైనా విన్నారా#
ఇది ఇక జంతువు, ఇది 9 జంతువులుగా మారగలదు, కనిపించగలదు. మహాభారతంలో దీని పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. విష్ణుమూర్తి అవతారం అయిన మృగంగా ఇది వస్తుంది. ఎవరైతే విశ్వరూప దర్శనం అర్జునుడికి ఇచ్చారో ఆ పరమాత్మ గీతలో కూడా చెప్పబడింది.
ఒడియాలో మహాభారతాన్ని Poet సరళదాసగారు రాశారు. అందులో ఈ నవగుంజర యొక్క గోప్పత్తనాన్ని వర్ణించాడు. ఒకప్పుడు, ఎప్పుడైతే అర్జునుడు ఒక కొండ మీద తపస్సు చేయగా అప్పుడు విష్ణుమూర్తి ఈ నవగుంజర రూపం లో ప్రత్యక్షమయ్యాడు.
నవగుంజర అనేది ఇలా ఉంటుంది.దీని తల కోడిలాఉండి, మొత్తం నాలుగు కాళ్లతో ఉంటుంది. అందులో మూడు కాళ్ళ మీద నిలబడి ఉంటుంది. ఆ కాళ్లు ఎలా ఉంటాయంటే, వరుసగా ఏనుగు కాలు, పులి కాలు, గుర్రంకాలు, నాలుగవ కాలు మాత్రం ఒక మనిషి చేతిగా మారి ఒక చక్రాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది. దాని మెడ నెమలి మెడలా, తల పైభాగంలో ఒక దున్నపోతులా, పూర్తి వెనక భాగం ఒక సింహములా దాని తోక పాములా ఉంటుంది. దీనినే నవగుంజర అంటారు....
మంచి విషయాలు అందరికీ తెలుపుదాం, జ్ఞానాన్ని పంచుదాం.
సేకరణ ---- Sri Gopaiah
**************************************************************************
హరిఓం రఘా, శబ్దం గురించి. నీవు చెప్పిన ప్రవచనం చాలా ప్రాక్టికల్గా వుంది. నాకు తెలిసిన విషయాలు నీతో మరియు మిత్రులందరితో చెప్తున్నాను.
ప్రపంచంలో సృష్టి తోపాటు పుట్టిన శబ్దం ఓం. ఈ ఓంకారం సౌ రమండలం అంతటా వ్యాపించి వుంది. ఈ విషయం మన వేదాలలో వుంది మరి దీనిని నాసా కూడా ఒప్పుకుంది.
నాకు తెలిసిన రెండవ విషయమేమంటే మనము మాట్లాడే భాష అనగా అక్షరాలు భగవంతుడు శివుని డమరునుండి వెలువడినయి. ఇది తిరుగులేని వేదవాక్యం. దాన్నే మహేశ్వర సూత్రం అంటారు. ప్రసిద్ధ సంస్కృత వ్యాకరణకర్త పానిని తన అష్టధ్యాయి అనే గ్రంథంలో వివరించాడు.మహేశ్వర సూత్రం యూట్యూబ్ వీడియో వేస్తున్నాను. 🕉️🕉️🕉️🙏🙏🙏
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Received from a friend...Worth Reading...
I boarded flight from Bangalore to Mumbai, economy class. I put my hand bag in overhead bin and took my aisle seat. There was an old person sitting next to me on the window seat.
I had a presentation in Mumbai, so took my documents and started going through them for the final time before the presentation. After 15–20 minutes I was done with my documents, so I put them away and started looking out of the window, and suddenly I looked at the face of this person sitting next to me. I thought I have seen him somewhere.
He was old, his face, the suit was not very expensive, and he was replying to some mails or going through some documents. I exactly don’t know. I noticed his shoes, they were average quality.
Something stuck me and I asked him:
“Are you Mr. Narayana Murthy?”
He looked at me, smiled and replied, “Yes, I am.”
I was shocked !
For one second I had no idea what to say next. I looked at him again. His shoes, his suit, his tie and his specs. Everything was average. This guy was worth $2.3 Billion and co-founded Infosys.
I always wanted to become super rich so that I can buy all the luxury and travel business class. He could buy the whole airlines and yet he was sitting next to me in economy class!
I again asked: “Why are you travelling in economy class and not business class?”
He replied:
“Do Business class people reach early?”
And then introduced myself, “Hello sir! My name is Mayank Gupta and I am a freelance corporate trainer and I work with many MNCs PAN India.”
He then put his phone away and started listening to me, he also asked few questions and answered the questions I asked. We both went down deep into the conversation until I asked a question which was about to change my life entirely.
I questioned:
Sir, You are so successful and have made so many good decisions in your life. Is there something you regret?”
He got intense look on his face, thought for a while and answered,
“Sometimes my knee hurts, I should have taken better care of my body. When I was young I was so busy working that I never got time to take care of myself and now even if I want to work more, I can’t. My body doesn’t permit.”
“You are young. You are smart and ambitious but don’t repeat the mistake I made. Take proper care of your body and take proper rest. This is the only body you have got!”
That day I learned two things, one that he told me and another that he showed me!
Being rich is not about owning things.
I had got what I needed.
What a great and down to earth human being he is, no doubt he is so successful !!!
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ఆ తేడా ఏమిటో తెలుసుకుందాము👇
👉ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.
ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది.
👉గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు. ఇలా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేస్తారు. ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు.
( గమనిక: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను already కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ).
దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.
స్వాతంత్ర్యం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు.
అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే..
👉 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting).
👉గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling) .
ఇంకొక వ్యత్యాసం ఏమిటంటే .. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి.
👉స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్ట్ 15 నాడు జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది.
👉 గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.
ఈ విషయం ఇప్పటికీ చాలా మంది ఈ దేశ పౌరులకు తెలియదు.(చదువుకున్న వాళ్లకు కూడా చాలా వరకు తెలియదు).
కావున ఈ information ను share చేసి మన వాళ్లకి అవగాహన కల్పించడం మన బాధ్యతగా భావించండి. ముఖ్యంగా విద్యార్దులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను.
భారత్ మాతా కీ జై...
****************************************************************************
ఉర్వారుక మివ బంధనం అంటే.....
ఇసుకలో ఆడుకొంటున్న పిల్లల్ని చూస్తుంటాం. అద్భుతంగా గుడి కడతారు. తీరికగా అలంకారాలు అద్దుతారు. తోచినంతసేపు హాయిగా ఆడుకుంటారు. పొద్దు వాలేటప్పటికి, ఆ కట్టడాలన్నింటినీ చటుక్కున కూలదోస్తారు. కిలకిల నవ్వులతో నిశ్చింతగా ఇంటిదారి పడతారు.
అక్కడి ఆ నిర్మాణాలకు సంబంధించిన మమకారాలు, వియోగ దుఃఖాలు ఏవీ వారికి ఉండవు. ‘అంతగా అయితే, మరునాడు వచ్చి మళ్ళీ కడతాం. పోయేదేముందీ’ అనే ధీమాతో పిల్లలందరూ ‘సొంతిళ్ల’కు వెళ్లిపోతారు.
‘త్య్రంబకం యజామహే...’ అనే మృత్యుంజయ మహామంత్ర సారాంశమూ అదే. ‘జీవితాన్ని ఎంతైనా నిర్మించుకో...ఆత్మీయ బంధాలెన్నింటినో పెంచుకో. ప్రేమానురాగాల్ని గాఢంగా పంచుకో. ఆట ముగిసే సమయానికి, వాటిని అదేవిధంగా సునాయాసంగా తెంచుకో’ అని ఆ మంత్రం బోధిస్తుంది. వాటికి, మనిషికి మధ్య ముడి ‘ఉర్వారుక మివ బంధనం’లా ఉండాలంటుంది.
పచ్చి దోసకాయ ముచికకు, దోస తీగకు మధ్య బంధం ఎంత గట్టిగా ఉంటుందంటే- ఆ కాయను పట్టుకు లాగితే ఆ తీగ మొత్తం వచ్చేస్తుంటుంది. అవి ఒకదాన్ని మరొకటి అంత గట్టిగా పట్టుకొని ఉంటాయి.
అదే రీతిలో మనిషి తన చుట్టూ ఉన్న పరివారంతో, ప్రపంచంతో బంధాన్ని అంత గట్టిగానూ పెనవేసుకొని ఉంటాడు. పిల్లలు ఇసుక గూళ్ళు కట్టినంత ప్రీతిగా తన, తనవారి జీవితాల్ని తీర్చిదిద్దుకుంటాడు. దోసపండు మిగలముగ్గేనాటికి పరిస్థితి మారుతుంది. ఉన్నట్లుండి ఆ తీగ నుంచి అది చటుక్కున విడిపోతుంది.
అప్పడు చూస్తే ముచిక గాని, తీగ గాని ఎండి ముదిరిపోయినట్లు ఉంటాయి. అంతవరకు ఆ రెండూ ఒకదానితో మరొకటి గాఢంగా, బలంగా అతుక్కునే ఉన్నాయా అనే అనుమానం వస్తుంది. ప్రపంచంతో అన్నింటినీ చివరన తెంచుకోగలిగితే, ‘ఈ ఆత్మ నిత్యం’ అని నమ్మగలిగితే మృత్యుభయాన్ని అధిగమించడం సాధ్యమవుతుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నిశ్చింతగా సొంతింటికి తిరిగి వెళ్లిపోయినట్లు, ఈ అద్దె ఇంటితో అనుబంధాన్ని వీడాలన్నదే ఆ మంత్ర మహోపదేశం! ‘దేహం వీడి వెళుతున్నాను’ అనేది అసురీ భావం. ‘అద్దె గృహాన్ని వీడుతున్నాను’ అనేది అమృత భావన! అలా అమృతత్వ స్థితిలోకి చేరుకోవడమే ముక్తి అనిపించుకుంటుంది. మనిషి జీవించి ఉండగానే సాధించాల్సిన స్థితి అది. అందుకే దాన్ని ‘ జీవన్ముక్తి ’ అంటారు,
*********************************************************************************88
A clock designed by
Pune University Samskruta(Sanskrit) department
Brahma is one.
Ashwini Kumars are two.
Gunas (satva, rajas, tamas) are three.
Vedas are four.
Pranas (vayus) are five.
Rasas (tastes) are six.
Rishis are seven.
Siddhis are eight.
Dravyaas are nine.
Dishas are ten.
Rudras are eleven.
Adityas are twelve.
Courteay : Mrs,Sukumari Reddy
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Comments
Post a Comment