Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju
ఉ|| ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
లక్ష్మి దేవి హరిని వరించుట
కంద : ఇందీవర దామమున ము
కుందుని బూజించి తనకు గూడి వసింపన్
మందిరముగఁ దద్వక్షము
నందంద సలజ్జదృష్టి నాలోకించెన్
8.126 Kanda Padyam
కంద పద్యం
జననస్థితిలయ దూరుని
మునినుతూ నిర్వాణసుఖ సముద్రుని సుగుణుమ్
దనుతనుని బృథుల పృథులుని
ననాఘాత్ము మహానుభావు నాభినందింతున్
8.163 కంద పద్యం
పురుషోత్తమ! నీ రూపము
పరమశ్రేయంబు భువనపంక్తులకెల్లన్
స్థిరవైదిక యోగంబున
వరుసను మీయంద కానవచ్చెన్ మాకున్.
8.289 కంద పద్యం
ఆ పాలవెల్లి కూతురు
దీవుల చూపులను డోగి తిలకింప బ్రజల్
చేపట్టిరి సంపదలను
బ్రాపించెను మేలు; జగము బ్రతికే నరేంద్రా !

8.310
కంద: నా నేర్పు కొలది మీకును
మానుగ విభజించి యిత్తు; మానుడు శంకన్
కానిం డనపుడునిచ్చిరి
దానవు లమృతంపు గడవ దరుణీమణికిన్
.jpg)
కంద పద్యం 8.3o0
పలుకులు మధురసధారలు
దలఁపులు నానా ప్రకారం దావానలముల్
చెలుములు సాలవృక్షములు
చెలువల నమ్ముతాలు వేదసిద్ధాంతములే?
కంద పద్యం 8.327
శోధించి జలధి నమృతము
సాధించి నిలింపవైరి చతుర్గతులన్
రోదించి సురల కిడి హరి
బోధించి ఖగేంద్రు నెక్కి పోయే నరేంద్రా !
(భాగవతం 8-363
జంభాసుర వృత్తాంతము
పోతన)
సారథి వేయు హయంబుల/
తేరాయిత పరచితేర
దేవేంద్రుడు దా/
నారోహించెను దైత్యుడు/
దారత మాతలిని శూలధారత బొడిచెన్.
8.397 Aataveladi
ఆ.వె . వాలుగంటి వాడి వాలారుజూపుల
శూలి ధైర్యమెల్లఁ గోలుపోయి
తరలి యెఱుకలేక మఱచె గణంబుల
నాలి మఱచె నిజగణాలి మఱచె
8.404 Kanda Padyam
జగదాత్మకుడగు శంభుడు
మగిడెను హరినెఱిగి తనది
మాహాత్మ్యమునన్
విగతతత్రపరుడై నిలిచెను
మగువతనం బుడిగి హరియు మగవాడయ్యెన్ .
చంపకమాల
చలమున బుద్ధిమంతులగు సాధులు నా
హృదయంబు లీల దొం
గిలి కొనిపోవుచుండుదు
రకిల్బిషభక్తిలతా చయంబులన్
నిలువఁగఁబట్టి కట్టుదురు నేరుపుతో
మదకుంభికైవడిన్;
వలలకు జిక్కి భక్త జనవత్సలతం
జనకుందు దాపసా .
Comments
Post a Comment