Comments on Jatayu's Moksham


Q. Rama has given moksha and sent Jatayu to oorthvalokas as per Valmiki Ramayanam. Rama always denied that he was not a God but a human being and son of King Dasharath. Now please give your comments whether is it possible to send Jatayu to oorthvalokas to a human being.[ Question given by Sri Chiluveru Ramachandra Murthy]

Comment by Sri Mahendra Raju : Here is my answer dear ..

The answer is there in Valmiki Ramayana itself . Valmiki says ‘Satyena lokan jayati’ — Rama conquered all the worlds through satya .. if He conquered all the worlds, He conquered Sri Vaikuntha also .. so, although Rama claimed He was human, He could send Jatayu to Sri Vaikuntha because He had conquered it by His adherence to Truth ..💜

Comment by Dr.Muralidhar:

డా . మురళీధర్ :నీవు అడిగిన ప్రశ్న శ్రీరాముడు మానవుడు కదా ! జటాయువుకి మోక్షమెలా ప్రసాదించాడు అని. దానికి నా జవాబు ఇలా ఉంది. జటాయువుకి మోక్షం లభించింది దాని కర్మఫలం వల్ల. మన సనాతనధర్మం ప్రకారం ఎవరైతే ప్రాణాలు వదిలే ముందు భగవన్నామ స్మరణం చేస్తారో వారికి మోక్షం లభిస్తుంది.

     "అంత:కాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం
     యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ: ll

 ఇది భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయంలో ఐదవ శ్లోకం.

శ్రీకృష్ణ భగవానుడు ఎవరైతే భగవన్నామస్మరణ చేస్తూ ప్రాణాలు వదిలేస్తారో వారికి మోక్షం వస్తుంది. అందులో సంశయమే లేదు అని చెప్తాడు. అదే జరిగింది. సంశయం  లేదు. జటాయువు ప్రాణాలు వదిలేస్తూ  " రామా", " రామా" ," రామా", అంటూ  శ్రీ రాముని చేతిలో ప్రాణం వదిలాడు. అందువల్ల దానికి మోక్షం లభించింది.  అప్పుడు శ్రీరాముడు మానవుడై  ప్రేక్షకుడిగా మాత్రమే  నిలిచాడు. దానికి మోక్షం లభించింది దాని కర్మఫలితం వలన. మన సనాతన ధర్మం ప్రకారం చెప్పబడింది.  ఇది నా అభిప్రాయం. శుభం భూయాత్.

HariOm! Murthy  and Mahender, Our Ramayana Mahakavya is the most disputed and distorted epic in our country. As a mortal Rama does not know that he conquered  Vaikunta by adhering to the truth. How can he send Jatayuvu to Vaikunta ?Until Vibhishana told,Rama didn't know that amruta kalasha is located in the navel of Ravana!!!but he knew that he can send anyone to Vaikunta!!! sounds unbelievable. If a man adhers to Satya, he can go to Vaikunta after death but he can't conquer Vaikunta and keep sending everyone there. Like this there are many disputes in Ramayana.One more example I will quote...did  Jatayuvu fall at Lepakshi in AndhraPradesh or in Kerala??

Comment by Lalasa

We all know that Lord Rama is incarnation of lord Vishnu. It is one among Dashaavataras. The main purpose of Rama avatar was to kill Demon Ravana and his brother Kumbhakarna.

The question is how can Rama who said he was a human being send Jatayu to urthvalokas ?

Ans : When King Ravana was carrying away Mother Sita, Jatayu ( the king of Birds) saw  and went to fight with mighty Ravana. In this fierce fight between the two Ravana wounded the bird and cutoff the both the wings and left it to die. In the meanwhile Lord Rama and Lakshmana who were searching Sita came there and saw the dying bird. Jatayu informed that Demon king Ravana took sita and went in the direction of south and died.

Lord Rama knew that he himself was God (Lord Vishnu) but never showed his Leelas as Lord Krishna. He always told he was a human being and the son of King Dasharatha, and never disclosed his true identity. Throughout his avatara he behaved in the same way and depended on Lord Hanuman, Sugreev, Jambavant and other vanaras in the battle of Rama and Ravana. The main reason is that king Ravana never expected that a  Manav (human being) would kill him and never included human beings and animals in his list while he got the boons from Lord Brahma. That’s why though Rama had all the Divine Powers he never used during Ramavatara Period and behaved like a typical manav. (He possessed all the best qualities of an Ideal person, an ideal ruler)

Jatayu lost his life in rescuing Mother Sita from Demon king Ravana. Jatayu’s death gave him more sorrow than the separation of Sita from him or the death of his father King Dasharath.

It is not a surprise that He has sent Jatayu to that uttamaloka as its sacrifice is not less than those who perform sacrifices, who are righteous, who are well known for their charity and who never retreat from the battlefield. Jatayu was fortunate to die in Lord Rama’s hands and got his last rites performed which even his father King Dasharath missed. This incident shows how much these animals love Him and  Mother Sita and vice versa.

Ref: Aranyakanda 68 Sarga,30th Verse (3.68.30 Valmiki Ramayana) Sampurna Ramayanam Pravachanam Episode 49 of Sri Samavedam Shanmukha Sharma gaaru.


Comment by Sri Chiluveru Ramachandra Murthy:

జటాయువు ప్రశ్నకి మహేంద్ర, మురళి మరియు సూర్యలాలస మాత్రమే జవాబు పంపినారు. అందరు చక్కగా చెప్పారు. మురళి అయితే భగవద్గీత శ్లోకం కూడా చెప్పి జటాయువు రామా రామా అంటూ రాముని చేతిలో ప్రాణం వదిలింది. ఊర్థ్వ లోకాలకు వెళ్ళింది అని చెప్పారు. మానవుడైన రాముని స్మరించినంత మాత్రానే జటాయువుకి ముక్తి లభించింది కదా ! మానవుడైన రామునికి అంత శక్తి ఎక్కడ్నుంచి వచ్చినది? నాకు తెలిసి రాముని యొక్క ధర్మ ప్రవర్తన, సత్యసంధత, పితృవాక్య పరిపాలకుడు, గుణవంతుడు, ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు, విద్యావంతుడు , ప్రజ్ఞాపాటవాలు కలిగినవాడు, కృతజ్ఞుడు, అరవైనాలుగు కళల్లో నిష్ణాతుడు, పదహారు గుణాలు కలవాడు ఇలా చెప్పుతూ పోతుంటే రాముని గుణాలు అనేకం. చాగంటి కోటేశ్వర రావుగారు, గరికిపాటి మొదలైన ప్రవచన కర్తలు గంటలకొద్దీ రాముని గుణగణాలు వర్ణిస్తారు. నేను మాత్రం కొన్ని గుణాలనే  చెప్పాను. అయితే రాముడు స్థితప్రజ్ఞుడు. స్థితప్రజ్ఞుడు అంటే భగవద్గీతలో రెండవ అధ్యాయంలో 54  నుండి 72  శ్లోకాలు చూస్తే రాముని యొక్క గుణగణాలు తెలుస్తాయి. బాగా వర్షాలు పడి చెరువు నిండిపోతే  ఏమవుతుంది? నీళ్లు పొంగి , వంతెన దాటి అన్ని చోట్లా ప్రవహిస్తాయి. అదే విధంగా రాముని కీర్త్తి కూడా ముల్లోకాల్లో వ్యాపించి ముల్లోకాలను ప్రభావితం చేసి రాముని ఆధీనంలోకి వచ్చాయి. రాముడు మానవుడైనప్పటికీ కూడా రామ నామంతోనే జటాయువుకి ముక్తి లభించింది కదా !

నేను ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్తాను. శబరి మనందరికీ తెలుసు కదా ! శబరి చిన్నతనం నుంచే మాతంగ ముని ఆశ్రమంలో ఆ మునికి శుశ్రూష చేస్తూ, అక్కడ పని చేస్తూ,ఉండేది . అంతిమక్రియలులో  ఊర్థ్వలోకాల కోసం ఈ యజ్ఞం చేసినప్పుడు ఆ పూజారి యజ్ఞం పూర్తి అయినా తర్వాత ఆ యజ్ఞకర్త కి కపాలమోక్షం (తల పగిలి  సహస్రార రంధ్రం నుంచి ప్రాణం పోతుంది) కలిగి ఊర్థ్వలోకాలకి వెళ్ళిపోతాడు.ఈ విషయం చాగంటి గారు, గరికిపాటి గారు చెప్పిన ప్రవచనాల వాళ్ళ తెలిసింది. ఈ యజ్ఞం చేసే ముందు  మాతంగముని శ్రీరాముడు  ఇక్కడికి వస్తాడు. అతనిదర్శనంతోనే నీకు ముక్తి కలుగుతుం ది. నీవు అంతదాకా ఇక్కడే వేచి ఉండు అని శబరితో  చెప్తాడు. అదేవిధంగా రాముడు అక్కడికి వస్తాడు. రాముని దర్శనంతోనే శబరికి ముక్తి కలుగుతుంది. మానవమాత్రుడైన శ్రీరాముని దర్శనంతో వారికీ మోక్షం లభించింది కదా ! ఇది రాముని యొక్క ధర్మప్రవర్తన మూలంగా అవుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. అదేవిధంగా రాముడు గౌతమ మహర్షి ఆశ్రమంలో అడుగు పెట్టగానే    అహల్యకి శాపవిమోచనం కలుగుతుంది. గౌతమ మహర్షి  ఆమెని తిరిగి భార్యగా స్వీకరిస్తాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. శ్రీరాముడు వనవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు సీతమ్మ ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతుంటాడు. ఆ సమయంలో కాకాసురుడు అనే రాక్షసుడు వచ్చి సీతమ్మని గాయ పరుస్తుంటాడు. చేతులతో విసిరి కొట్టినా వెళ్ళడు. ఆ గాయంనుంచి రక్తం కారుతుంటుంది. ఆ రక్తపు చుక్కలు రాముని మీద పడి నిద్రాభంగం అవుతుంది. రాముడు నిద్ర లేచి, సీతని చూసిన వెంటనే కోపావేశంతో పక్కనే ఉన్న చిన్న గరిక పుల్లని తీసుకుని బ్రహ్మాస్త్రంగా కాకాసురుని మీద ప్రయోగిస్తాడు. దానినుండి తప్పించుకోవడం కోసం కాకాసురుడు దేవతలందారి దగ్గరకి పరుగెత్తుతాడు. ముందు ఇంద్రుణ్ణి అర్థిస్తాడు. రామునిబాణాన్ని అడ్డుకోవడం నా తరం కాదు అని ఇంద్రుడు  చెప్తాడు. వెంటనే కాకాసురుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి శరణు వేడినా బ్రహ్మ దగ్గర్నుంచి అదే సమాధానం, ఆ తర్వాత మహేశ్వరుడు కూడా రామబాణాన్ని నివారించడం నా తరం కాదు అని సమాధానం చెప్పి శ్రీ రాముణ్ణే శరణు కోరుకొమ్మని సలహా ఇస్తాడు.. అప్పుడు గత్యంతరం లేక కాకాసురుడు రామున్ని శరణు వేడుతాడు. రాముడు ఎలాంటి వాడంటే 

             " సక్రుదేవ  ప్రపన్నాయ తవా స్మీతి చ యాచతే l

               అభయం సర్వభూతేభ్యో దదామ్యేత ద్రవతం మమ ll " 

రావణాసురుడు స్వయంగా వచ్చి  నన్ను శరణు వేడినా నేను అతన్ని క్షమిస్తాను అని అంటాడు. అలాంటిది కాకాసురుణ్ణి క్షమించలేడా ? అయితే బ్రహ్మాస్త్రం ఊరికే పోదు. ఏదో ఒక నష్టం చేసే పోతుంది. అయితే ఇక్కడ కాకాసురుణ్ణి చంపకుండా అతని ఒక కంటిని పోగొడుతుంది. మీరు గమనించారా కాకి ఒక కన్నుతోనే చూడగలుగుతుంది.

ఇంకొక ఉదాహరణ చెప్తాను. రావణాసురిడి కొడుకైన ఇంద్రజిత్తు బ్రహ్మా మహేశ్వరులనుంచి వరాలు పొందుతాడు. ఎన్నో అస్త్రశస్త్రములు తెలుసు.రామాయణ యుద్ధం జరుగుతున్నప్పుడు రావణుడి కొడుకైన మేఘనాథుడికి  (ఇంద్రజి త్తు) లక్ష్మణుడికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇద్దరికీ  ఎన్నో దివ్యాస్త్రాలు తెలుసును. నాగాస్త్రం, గరుడాస్త్రం, వారుణాస్త్రం, పాశుపతాస్త్రం వగైరా వగైరా. అస్త్రానికి, శాస్త్రానికి భేదం ఏమిటో ముందు తెలుసుకుందాం. అస్త్రం అంటే మంత్రం తో కూడుకున్నది. నిష్ఠతో దానికి సంబంధించిన  ఆ మంత్రాన్ని చదివి బాణాన్ని ప్రయోగించాలి. శస్త్రం అంటే మామూలు గా యుద్ధంలో వాడే పరికరం. దానికి ఏ మంత్రాలు ఉండవు. ఇలా ఇంద్రజిత్తు, లక్ష్మణుడు అన్ని శస్త్రాల్లో ఆరితేరిన వాళ్ళే. ఇద్దరు సమ ఉజ్జీలే. అయితే ఇంద్రజిత్తు వేసిన   అస్త్రానికి ప్రతి అస్త్రం వేసే లోపల ఆ అస్త్రం లక్ష్మణునికి తగిలి అతను మూర్ఛ పోతాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుడు మరణించాడు అని అనుకుని సంతోషంగా, విజయగర్వం తో వెళ్లి పోతాడు. హనుమంతుడు సంజీవని పర్వతం తీసుకొస్తాడు. ఆ సంజీవని మొక్క తో వైద్యం చేసిన పిమ్మట లక్ష్మణుడికి తెలివి వస్తుంది. ఆ మరుసటి రోజు వారి మధ్య జరిగిన తీవ్ర యుద్ధంలో చివరకి లక్ష్మణుడు ఒక బాణం తీసుకుని (శస్త్రం కాదు)

          "ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథి: యది l

          పౌరుషే చా ప్రతిద్వంద్వ: శరేణ జహి రావణీం ల్

రాముడే ధర్మాత్ముడైతే , సత్యమునకు  నిలబడినవాడైతే, పౌరుషవంతుడైతే, పరాక్రమవంతుడైతే, ఈ బాణం ఇంద్రజిత్తుని చంపేస్తుంది అని అంటాడు. పరాక్రమవంతుడంటే ఏమిటో అన్ని చానెల్స్ లో చెప్తున్నారు వేదపండితులు చాలా గుణాలు చెప్తున్నారు. నేను కొన్నే చెప్తాను. సత్యము, ధర్మము, దానము, గుణము, యుద్ధంలో వెనుకంజ వేయని వాడు ఇలా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇన్ని గుణగణాలు కలవాడు కనుకనే ఆ రామబాణం నేరుగా వెళ్ళి ఇంద్రజిత్తుని చంపుతుంది. ఇంద్రజిత్తు కూడా బ్రహ్మామహేశ్వరులనుంచి ఎన్నో వరాలు పొందాడు. ఎన్నొరాముడిగా  అస్త్రాలు పొందాడు  కానీ ఏం ప్రయోజనమైంది? రాముణ్ణి తలుచుకుని వేసిన బాణం అతన్ని కాపాడలేక పోయింది కదా !మానవుడైన రాముని మూలంగానే ఇంద్రజిత్తు ప్రాణాలు పోయినాయి కదా !  దీన్ని బట్టి అన్ని లోకాలు రాముని అధీనంలో ఉన్నట్టే కదా !

మురళీధర్ గారి ఇంకొక అనుమానం తీర్చటానికి ప్రయత్నిస్తాను. విభీషణుడు చెప్పేంతవరకు రావణుడి నాభిలో అమృతకలశం ఉన్నట్టుగా రాముడికి తెలియదు. విభీషణుడు చెప్పాకే రాముడు రావణుని పొట్ట మీద బాణం వేసి చంపాడు అని అన్నారు. అది తప్పు. వాల్మీకి రామాయణంలో అసలు అలా లేనే లేదు. రావణుడు మానవుని చేతిలోనే చస్తాడు కాబట్టి రాముడు మానవరూపం లో వచ్చి  బ్రహ్మాస్త్రం వేసి చంపినట్టుగా ఉంది.  మిస్టర్ A గారు చెప్పినట్టుగా ఆ జటాయువు "రామ ", :రామ" అని ప్రాణం విడిచింది. అందుకనే దానికి ముక్తి లభించింది. అంటే కాకుండా కర్మ పరిపక్వము అయ్యాక ముక్తి దొరుకుతుంది. అది నిజమే. నేను ఏకీభవిస్తాను. అంతే  కాకుండా యోగ్యతను బట్టి వస్తుంది.  శివపురాణం లో మహాదేవుడు కూడా ఏనుగుకి, సాలె పురుగుకి, పాముకి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎవరైతే  అంటే ఏ గురువైతే ఆత్మని సందర్శిస్తాడో ఆగురువు కూడా యోగ్యత గల తన శిష్యునికి మోక్షం ప్రసాదించగలడు. అతి తక్కువ కాలంలో మన సంచిత కర్మలను నశింపచేసి ముక్తిని ప్రసాదించగలడు. అయితే అది అంత సులభం కాదు. శిష్యుడు తన గురువుకి అన్ని విధాలా శుశ్రూష చేసి, చక్కగా విద్యనభ్యసించి గురువుగారి ప్రీతిని సంపాదించగలగాలి. అప్పుడే ఆ గురువు ఆ శిష్యునికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఈ కలి యుగంలో మన రమణ మహర్షి గారు మీ అందరికి తెలిసినవారే కదా ! ఆయన సంగతి చెప్తాను. 1922  లో రమణ మహర్షి అమ్మగారైన శ్రీమతి కనకమ్మగారి ఆరోగ్యం క్షీణించి అంతిమ సమయం వచ్చాక, ఆమె మరణ సమయంలో తన కుడి చేతిని ఆమె ఎడమ ఛాతి మీద, ఎడమ చేతిని ఆమె తల మీద ఉంచి, ఆవిడ పూర్వ జన్మల సంచిత కర్మలన్నీ అనుభవించేటట్టుగా చేసి, ఇక ఏ కర్మ లేకుండా చేసి ఆవిడకి ముక్తిని ప్రసాదించారు. అంటే మళ్ళీ ఆవిడకి జన్మ లేకుండా జరామరణాల చక్రం నుంచి విడుదల చేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆధ్యాత్మిక జగత్తులో ఎన్నో ఈ కలియుగం లో ఉన్నాయి. ఇలాంటి మహర్షులు ఎంతమందో ఉన్నారు. బ్రహ్మశ్రీ  విశ్వామిత్ర స్వర్గాన్నే సృష్టించ గలిగారు తన తపశ్శక్తి తో. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

In this way we got divergent views for the same question.

Comments

Popular posts from this blog

A B V High School Friends Stories -1

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju

Bhagavad-Gita (Purushottama Yoga 15.1 shloka