Miscellaneous - Sujata and others

ప్రియమైన సహ జిజ్ఞాసులారా! నమస్కారం. గీతా సారాంశము రెండు పదాలలో ఉంది - అవి ఏవి? అన్న ప్రశ్నను పరిశీలిద్దాం: భగవద్గీతలో మొదటి శ్లోకం (1-1) ధృతరాష్ట్రుడు పలికినది: " ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవా శ్చైవ కి మకుర్వత సంజయ" ఈ శ్లోకం “ధర్మక్షేత్రే” అన్న పదబంధంతో ప్రారంభమయింది. ఈ సమాసంలో మొదటి పదము ‘ధర్మ.’ ధర్మ రూపంలో ఉండేది, ఉన్నది దైవమే. ధరించునది ధర్మం (ధరతీతి ధర్మః). ప్రపంచానికంతటికీ ధర్మమే ఆధారమని (ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా) తైత్తిరీయ ఉపనిషత్తు చెబుతోంది. అందుకని ధర్మం అనేది భగవద్విభూతియే. భగవంతుని రూపమే. ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడనీ, ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటే అక్కడ ‘జయము’ ఉంటుందని వ్యాసవాణి. ఈ విధంగా ప్రథమ శ్లోకం “ధర్మ” తో ప్రారంభమై, “జయ” అనే పదంతో ముగిసింది. అంటే – ధర్మమే గెలిచి తీరుతుంది (ధర్మమేవ జయతే) అన్న ఆర్షోక్తిని ఈ శ్లోకం చక్కగా ఆవిష్కరించింది. ఇక, గీతలో చివరి శ్లోకము (18-78) లోని చివరి పదము “మమ.” " యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్థరః తత్ర శ్రీ ర్విజయో భూతిః ధ్రువా నీతి ర్మతి ర్మమ" ఈ రెండూ – అంటే, మొ...