Posts

Showing posts from February, 2024

Gajendra Moksham- Courtesy Dr. Mahendra Raju

Image
ఉ|| ఎ వ్వ నిచే జనించు జగ  మె వ్వని లోపల నుండు లీనమై; యె వ్వ ని యందు డిందుఁ; బర మే శ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం బె వ్వఁ ;   డనాదిమధ్యలయుఁ  డె వ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ డె వ్వఁ డు; వాని నాత్మభవు  నీ శ్వరు నే శరణంబు వేడెదన్. లక్ష్మి దేవి హరిని వరించుట కంద పద్యం                                   కంద : ఇం దీ వర దామమున ము                                              కుం దు ని బూజించి తనకు గూడి వసింపన్                                              మం ది రముగఁ దద్వక్షము                                               నం దం ద సలజ్జదృష్టి నాలోకించెన్  8.126 Kanda Padyam   కంద పద్యం  జ న నస్థితిలయ  దూరుని ము ని నుతూ నిర్వాణసుఖ  స ము ద్రుని సుగుణుమ్  ద ను తనుని బృథుల పృథులుని న నాఘాత్ము మహానుభావు నాభినందింతున్ 8.163  కంద పద్యం  పురుషోత్తమ! నీ రూపము  ప రమశ్రేయంబు భువన పం క్తులకెల్లన్  స్థిరవైదిక యోగంబున  వ రుసను మీయంద కాన వ చ్చెన్ మాకున్.                                                 8.289    కంద పద్యం  ఆ పా లవెల్లి కూతురు  దీ వు ల చూపులను డోగి తిలకింప బ్రజల్ చే ప ట్టిరి  సంపదలను బ్రా పిం చెను మేలు; జ

Samudra Manthanam

Image
  Courtesy :Sri Mahendra Raju శ్రీ మదాంధ్ర భాగవతం➖ (57వ భాగం) పామును మంధరపర్వతమునకు చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి. అది క్రిందకు జారిపోకూడదు. దేవదానవులిరువురూ చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. భుగభుగభుగమని పాలసముద్రం లేచింది. నురగలు లేచాయి. కెరటములు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమయిన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు మంధరపర్వతమును గిరగిర తిప్పేస్తున్నారు.  వాసుకి ‘మీరు సరిగ్గా చిలకడం లేదు వదలండి’ అని కేకలు వేశాడు.  వాళ్ళందరూ వాసుకిని వదిలేశారు. పట్టు తప్పిపోయి మంధర పర్వతం జారి క్రిందపడిపోయింది.  అందరూ శ్రీమన్నారాయణుని వైపు చూశారు.  ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారమును స్వీకరించాడు.  కొన్ని లక్షల యోజనముల వెడల్పయిన పెద్ద డిప్ప. ఆ డిప్పతో పాలసముద్రం అడుగుకి వెళ్ళి ఇంతమంది కదల్చలేని మంధరపర్వతమును తన వీపుమీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తుండమును అటూ ఇటూ ఆడిస్తున్నాడు. తన నాలుగు కాళ్ళను కదల్చకుండా తానే ఆధారమయి, మంధరపర్వతమును వీపుపై ధరించి ఉన్నాడు.  ఆ కూర్మ